అసెంబ్లీలో గురువారం నాటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని మరోసారి పరిహాసం ఆడాయి. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదో దుర్దినం. బ్లాక్ డే. చీకటి రోజు. ఎవరి నిర్ణయాలపైనైనా సమీక్షించి తమ అభిప్రాయం చెప్పే భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ రాజ్యాంగం ఇచ్చింది. చట్ట సభల్లోనూ ప్రతి సభ్యునికీ తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. ఏదేని నిర్ణయాలకు, విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి అనేక పద్ధతులున్నాయి. అందుకు భిన్నంగా వీధి రౌడీలు, అనాగరికుల మాదిరిగా వ్యవహరించారు కొంత మంది శాసనసభ్యులు. దాదాపు రెండు లక్షల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు తమ బాధ్యతలు నిర్వహించకుండా పశువుల్లా చట్టసభల్లో ప్రవర్తించడం ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, విలువలకు అవమానం, గొడ్డలిపెట్టు.
చట్టసభలు, రాజకీయాలు, శాసనసభ్యులంటే ఇప్పటికే ప్రజల్లో అసహ్యం ఏర్పడింది. చిన్న పిల్లల్ని అడిగినా అసెంబ్లీలో కొట్టుకుంటారని, బూతులు తిట్టుకుంటారని సమాధానం చెప్పేంతగా దిగజార్చారు మన ప్రజాప్రతినిధులు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అందులోనూ గవర్నర్ ప్రసంగం.. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ పనితీరుకు దిశ, నిర్ధేశం చేస్తుంది. సర్కార్ నడవడిక ఎలా ఉండబోతోందో గవర్నర్ నోట సర్కార్ చెప్పిస్తుంది. ప్రజలకు మేలు చేసే విధానాలు చేపట్టేలా ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత చట్టసభల్లోని ప్రతి సభ్యునికీ ఉంది. ప్రధానంగా ప్రతిపక్షాలకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. అలాంటిది గవర్నర్ ప్రసంగంలోని అంశాలు నచ్చకపోతే నిరసన చెప్పడానికి పలు మార్గాలున్నాయి. వాకౌట్ చేయొచ్చు. నినాదాలు చేయొచ్చు, బహిష్కరించొచ్చు, ప్లకార్డులు ప్రదర్శించొచ్చు. తమ అభిప్రాయాలను చెప్పొచ్చు. అదేం లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, దాడి చేయడం హేయమైన చర్య. టిఆర్‌ఎస్ సభ్యులది సింగిల్ ఎజెండా. విచిత్రమేంటంటే చంద్రబాబు సమక్షంలో ఆయన టీంలోని తెలంగాణ సభ్యులు వీరంగం వేయడం, టిఆర్‌ఎస్‌తో పోటీపడి పోడియం మీదకు పోయి కుర్చీలు పడేయడం, మైకులు విసరడం, బెంచీలపై ఎక్కడం దారుణం. చంద్రబాబు తమ సభ్యులను వారించకపోవడం గర్హనీయం.
అసెంబ్లీలోని ఈ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేసిన లోక్‌సత్తా సభ్యుడు జయప్రకాశ్ నారాయణ్‌పై అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కొంత మంది టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేయడం ఘోరం. అసెంబ్లీ ఆవరణలో ఒక ఎమ్మెల్యేపై సాటి ఎమ్మెల్యేలు కొట్టడం, పిడి గుద్దులుగుద్దడం క్షమించరాని నేరం. తమ వ్యతిరేకులను కొట్టడం, వారి భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం, తాము చెప్పినట్లే నడవాలని శాశించడం కొత్త తరహా ఫాసిజం. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి పనికొస్తాయి.
జెపిపై టిఆర్‌ఎస్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థులపై కేసుల ఎత్తివేతపై గొడవ జరుగుతుంటే జెపి తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. 'చిన్న కేసులు ఎత్తేయాలి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, భౌతిక దాడులు, బ్లాక్‌మెలింగ్‌తో బలవంతంగా డబ్బులు వసూళ్లు చేయడం కూడా నేరమే అవుతుంది' అని విమర్శించారు. అప్పట్లో జెపి వ్యాఖ్యలపై నిరసన తెలిపిన టిఆర్‌ఎస్ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. గురువారం తమ చేతినిండా దొరికిన జెపిపై దౌర్జన్యం చేసింది. చేయి చేసుకుంది.
గురునాటి అసెంబ్లీ పరిణామాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు సోకాల్డ్ ఎమ్మెల్యేలు. వాటిని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, రాజకీయపార్టీలు, పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, మేధావులు, కళాకారులు, కవులు అందరూ తీవ్రంగా ఖండించాలి. భౌతిక దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం, అసెంబ్లీ కఠినంగా శిక్షించాలి.
ఇటువంటి దౌర్జన్యాలతో ఉద్యమం పెరగకపోగా ప్రతిష్ట దిగజారుతుందని, మసకబారుతుందని ఆందోళనకారులు గమనంలో పెట్టుకోవాలి. శక్తిమంతమైన 'రాజ్యం' ఇటువంటి దాడులతో మరింత నిర్బంధాన్ని ప్రయోగించడం ఖాయం. అదే జరిగితే ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. దాడి పెంచుతుంది. అది ప్రజలకి తీరని నష్టం కలిగిస్తుంది.

i support the attack on JP for his over comments on T
ReplyDeletedo not be over excited sir. you also see the comments of JP and governer as a telangana person. the way they comment about telangana is regrettable(Like not in syllabus etc).
ReplyDeleteIf an attack on them makes you to excite this much then the attack on moral of 4Cr telangana people will definetly be
Langa kodakallara repu talangaana vasthe mimmalini kooda doralu ilage kotti chamoutaaru langaa laara melukoni telivi tecchu komdi
ReplyDelete