Monday, February 14, 2011

సూరి హత్య..జగన్‌కు లింక్‌ పెట్టేందుకు శోధన?

మద్దెలచెర్వు సూరి హత్య జరిగి నలభై రోజులైంది. సూరి అంటే సాదా సీదా వ్యక్తి కాడు. పెద్ద ఫ్యాక్షనిస్టు. జూబ్లీహిల్స్‌ కారు బాంబు కేసులో 34 మంది అమాయకుల మరణానికి కారణమై శిక్ష అనుభవించిన వ్యక్తి. టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు. అనంతపురం, హైదరాబాద్‌, విజయవాడ తదితర ప్రాంతాల్లో అనధికారిక సెటిల్‌మెంట్లు జరిపిన మాఫీయా కం ఫ్యాక్షన్‌ లీడర్‌. ఇంత నేర చరిత్ర ఉన్న సూరిని ఆయన అనుచరుడు భానుయే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డులో అదీ పట్టపగలు హత్య చేసి పారిపోతే ఇంకా పోలీసులు భానును అరెస్టు చేయలేకపోతే ఏమనుకోవాలి? ఇందులో పోలీసుల వైఫల్యం ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశీ ఉగ్రవాదులను సైతం పట్టుకున్న పోలీసులు సూరిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ప్రత్యేక బృందాలని, దర్యాప్తని ఎందుకు సా..గదీస్తున్నారు? 
 
ఈ ఏడాది జనవరి 3 సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌ సమీపంలో సూరి హత్యకు గురయ్యాడు. పోలీసులు అప్రమత్తమయ్యారు. భాను పోలీసుల ముందు లొంగిపోయాడని పుకార్లొచ్చాయి. వాటికి బలం చేకూర్చే విధంగా డిజిపి అరవిందరావు అప్పట్లో మాట్లాడారు. ఆ తర్వాత భాను తమ వద్ద లేడని పోలీసులు తోసిపుచ్చారు. సినిమా నిర్మాతలను విచారించారు. ఎవరినీ అరెస్టు చేయలేదు. ఎట్టకేలకు నలుగురు అనామక అనుమానితులనైతే అరెస్టు చేశారు.

కాల్పులు జరిగినప్పుడు సూరి ప్రయాణిస్తున్న కారు నడుపుతున్న డ్రైవర్‌ మధును విచారించారే తప్ప అరెస్టు చేయలేదు. మన్మోహన్‌ స్కెచ్‌ వేశాడని, ఆయన చూపిన మార్గంలో భాను ఎక్కడో తలదాచుకున్నాడని పోలీసులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయల అస్తులు భాను బినామీ పేర్ల మీద ఉన్నాయంటున్నారు. సూరి, భాను దందాలు పోలీసుల దృష్టికి ఇంతకాలం ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే అధికారులు నోరు వెళ్లబెడుతున్నారు.

భాను ఎక్కడున్నాడో పోలీసులకు తెలుసంటూ గుసగులాడుతున్నారు అధికారులు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే భానును అరెస్టు చేయడం లేదని తెలుస్తోంది. సూరి భార్య భానుమతి ఆరోపణల మేరకు విజయవాడ టిడిపి నేత వల్లభనేని వంశీని పోలీసులు విచారించారు. పరిటాల అనుచరులు పోతుల సురేష్‌, చమన్‌పైనా భానుమతి అనుమానం వ్యక్తం చేసినందువల్ల జైలులో ఉన్న పోతుల సురేష్‌ను విచారించడానికి ప్రయత్నిస్తున్నారు.

వీటన్నింటికంటే ప్రభుత్వానికి మరో టార్గెట్‌ ఉందంటున్నాయి పోలీస్‌ వర్గాలు. అదేంటంటే...ఏదొక విధంగా సూరి హత్య కేసును వైఎస్‌ జగన్‌కు లింక్‌ పెట్టాలని చూస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఎలాగైనాసరే జగన్‌కు సంబంధం ఎక్కడైనా దొరుకుతుందా అని పోలీసులు శ్రమ పడుతున్నట్లు సమాచారం. అందుకు ఎక్కడెక్కడి అంశాలనో వెలికి తీస్తున్నారు. ఎప్పుడో సూట్‌కేసు బాంబు కేసును తిరగదోడి మంగలి కృష్ణ, తదితరుల పేర్లు బయటికి తీసి జగన్‌కు సూరికి మధ్య ఉన్న సంబంధాన్ని, తద్వారా భానుతో లింక్‌ ఏమైనా ఉంటే దాన్ని వెలికి తీసి రాజకీయంగా జగన్‌ను దెబ్బ కొట్టాలని పావులు కదుపుతున్నారని విమర్శలొస్తున్నాయి. జగన్‌ పార్టీ పెట్టేలోపు లింక్‌ను పట్టుకోవాలని ప్రయాశ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ జగన్‌కు లింక్‌ ఏమీ దొరకలేదని పోలీసులే చెబుతున్నారు.

2 comments:

  1. identi sir...meeru oka partrica buro chief...eppudu choosinaa andari kiagainst gaa and oke vyakti ki support gaa raastaaru.........

    Ikkada kottagaa vache devuni biddaku...aayana kishkinda mookaku oke avalakshanaalu vunatlunnai....

    1) andari meeda burada challu

    2) e vishyam jariginaa adi mana anthatodi image ni tattuko leka aape prayatnam lo ne jariginatlu prachaaram chesukovatam...(Nijam gaane alaa feel a)yite first yerragadda lo admit avatam better

    Inni rojulanunchi raastunaaru...devuni bidda gurinchi post lu vuntayya ante vundavu....sare kukkala gurinchi pattinchukoni vaaraa ante adi kaadu.....prati post lo ee kottha kukke main seed of the story laa vuntai stories

    ReplyDelete
  2. COMMENT POST CHESINANDUKU 'VARA' GARIKI THANKS

    ReplyDelete