ఐపిఎల్, ఆదర్శ్, కామన్వెల్త్, 2జి స్ప్రెక్ట్రం, తాజాగా ఎస్- బ్యాండ్ వరుస కుంభకోణాలతో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటోంది కాంగ్రెస్. వాటి నుండి ఎలా బయట పడాలా అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మదన పడుతుంన్నారు. ఈ సమయంలో సోనియా నాయకత్వంలో అవినీతిపై పోరాడతామంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అదేంటంటే... సోనియా అవినీతిని ప్రక్షాళన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆదర్శ్ కుంభకోణం వెలుగు చూడగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేశారని, మరికొన్ని స్కాంలపై సిబిఐ విచారణ జరిపిస్తున్నారని పేర్కొన్నారు. 2జి స్ప్రెక్ట్రం, ఎస్-బ్యాండ్ సంగతేమిటి అనడిగితే, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటునకు సుముఖంగా ఉన్నారని, అందుకే ప్రతిపక్ష నేతలతో చర్చలు జరుపుతున్నారని సమర్ధించుకున్నారు. జెపిసికి ఇన్నాళ్లెందుకు పట్టిందని అంటే జవాబు దాటేశారు.
కాంగ్రెస్‌లో విలీనమైనప్పటికీ గతంలో జెపిసిని ఏర్పాటు చేయాలని తాను చేసిన డిమాండ్‌కు కట్టుబడి ఉన్నానన్నారు మెగాస్టార్. కాంగ్రెస్‌లో చేరి ఆ డిమాండ్‌పై ఎలా పట్టుబడతారని ప్రశ్నిస్తే అదంతే అన్నారు. కుంభకోణాలు జరిగినంత మాత్రాన వాటిని సోనియా చేసినట్లు కాదని ముక్తాయింపు ఇచ్చారు. రాష్ట్రంలో వైఎస్ హయాంలోనే కుంభకోణాలు జరిగాయని, రోశయ్య, కిరణ్‌కుమార్ హయాంలో ఒక్క స్కాం కూడా బయట పడలేదని చెప్పుకొచ్చారు.
వైఎస్ అవినీతి చేసినట్లతే ఆయన సమయంలోని మంత్రుల్లో ఎక్కువ మంది ఇప్పుడూ ఉన్నారు కదా, వారికి బాధ్యత లేదా, వారి ప్రభుత్వానికే కదా మద్దతిస్తున్నారు అని నిలదీస్తే ఎప్పుడూ తాను వ్యక్తుల గురించి ఆలోచించలేదని, మీడియాలో వచ్చిన అంశాలపైనే మాట్లాడుతున్నానని తప్పించుకున్నారు పాపం చిరు.
ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ వల్లనే సామాజిక న్యాయం ప్రజల దరి చేరలేదు. అవినీతికి చిరునామా కాంగ్రెస్. అదే కాంగ్రెస్ తీర్థం ఎందుకు పుచ్చుకున్నారని అడిగితే... ఇటీవలి కాలంలో కాంగ్రెస్ చేపట్టిన చర్యల వల్ల తనకు ఆ పార్టీపై నమ్మకం పెరిగిందన్నారు.
టిడిపి, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి వెళ్లిన ప్రజారాజ్యానికి 18 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరితే ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్లు కాదా? నైతిక విలువలుంటే చిరంజీవితో సహా 18 మంది ఎమ్మెల్యేలూ రాజీనామా చేసి హస్తం గుర్తుపై గెలుపొంది ప్రజల మద్దతు పొందవచ్చు కదా? అసలా 18 మంది ఎమ్మెల్యేలూ లేకపోతే పిఆర్‌పి అవసరం కాంగ్రెస్‌కు లేనే లేదు కదా?

No comments:
Post a Comment