కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి (కాకా) ఎందుకు అంతగా రెచ్చిపోయారు? అంతలోనే ఎందుకు చల్లబడ్డారు?.. వైఎస్‌పై, జగన్‌పై ఒంటికాలిపై లేచే కాకా ప్రతి సమయంలోనూ పార్టీ హైకమాండ్‌కు విధేయుడిగా మెలిగారు. రాష్ట్రపతి పదవిని ఆశించి భంగపడ్డాక కూడా తనకు పదవి రాకపోవడానికి వైఎస్సే కారణమన్నారు తప్ప అధిష్టానంపై ఒక్క మాట మాట్లాడలేదు. బుధవారం కాకా ఏకంగా సోనియాగాంధీపై విమర్శలు సంధించి సంచలనం సృష్టించారు. తక్షణం పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వల్లనే పార్టీ ప్రతిష్ట దిగజారిపోతోందని నిప్పులు చెరిగారు. అంతేకాదు అవినీతి పెరిగిందన్నారు. కెవిపి ద్వారా వైఎస్ ఎఐసిసి సభ్యులకు డబ్బు సంచులు పంపారని ఆరోపించారు. ఈ విమర్శలు కేవలం చిరంజీవి కాంగ్రెస్‌తో కలవడం ఇష్టలేకనే చేసినవి కావనిపిస్తోంది.
గురువారం సాయంత్రం వరకూ కాకా తన విమర్శలకు కట్టుబడి ఉన్నట్లు పదేపదే మీడియాలో చెప్పారు. వీరప్పమొయిలీ సైతం కాకాపై చర్యలు తీసుకోవడమే తరువాయన్నట్లు మాట్లాడారు. అంతలో ఏమైందో ఏమో రాత్రికి కాకా మాట మార్చారు. తాను కంట్రోల్ తప్పానని చల్లబడ్డారు. సోనియాను దృష్టిలో ఉంచుకొని ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయలేదని సంజాయిషీ ఇచ్చుకున్నారు.
కాకా విమర్శలు కేవలం ఆయన వ్యక్తిగతమైనవి కావు. సీనియర్ లీడర్‌గా ఆయన మాటలకు కాంగ్రెస్ బహిరంగంగా సంజాయిషీ ఇచ్చుకోవాలి. అవినీతి, డబ్బుసంచులంటూ కాకా చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి. లేకపోతే కాంగ్రెస్‌పై ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందని ప్రజలు నమ్మాల్సి ఉంటుంది. ఇదే సమయంలో రాజీ కుదిరినందువల్లనే చల్లబడ్డారన్న అపవాదు కాకా మోయక తప్పదు.

No comments:
Post a Comment