Monday, February 7, 2011

'చేతి'లో 'సూర్యుడు'..జెండా పీకిన చిరు

'చేతి'లో 'సూర్యుడు'.. హస్తమించిన సూర్యుడు.. పట్టాలపై రైలొచ్చింది... 18 బోగీలతో కదిలింది..ఆ పట్టాలపై ఆ రూపంలో మళ్లీ కనబడదు... 'మార్పు' కోసం ఆ రైలు మరో రైలుకు తోకగా 'మార్పు' చెందింది.
  • 2008 ఆగస్టు 17 ఆదివారం మధ్యాహ్నం. సమయం రెండున్నర. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.46లోని తన కార్యాలయంలో మెగాస్టార్‌ చిరంజీవి తొలిసారి రాజకీయ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. త్వరలో పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు బహిరంగంగా వెల్లడించారు.
  • 2008 ఆగస్టు 26.. తిరుపతిలో వెంకటన్న సాక్షిగా సాయంత్రం ఏడున్నరకు ఉద్విఘ్న క్షణాల మధ్య భావోద్వేగంతో అశేషంగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్‌ ప్రకటించారు. జెండాను ఆవిష్కరించారు. మార్పు, సామాజిక న్యాయం, అవినీతిపై పోరాటం, ప్రేమే మార్గం-సేవే లక్ష్యం, సామాజిక తెలంగాణ, టిడిపి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం, ప్రజల కోసం సైనికుడిగా పోరాటం... అంబేద్కర్‌, జ్యోతిరావుపూలే, మదర్‌ థెరిస్సా, మహాత్మాగాంధీ బ్యాక్‌ డ్రాప్‌లో సభా వేదికపై అప్పటి నినాదాలివి.
  • రెండున్నరేళ్ల తర్వాత సీన్‌ కట్‌ చేస్తే... ఢిల్లీ జన్‌పథ్‌లో నిరీక్షణ. కాంగ్రెస్‌లో విలీనం. ప్రజారాజ్యం కాంగ్రెస్‌ భోజ్యం. చిరంజీవి'18 టీం టోకుగా గాంధీభవన్‌కు ధారాదత్తం.
ఠాగూర్‌ సినిమాలో పాటకు పేరడీ
నేను సైతం పది జన్‌పథ్‌కు ప్రజారాజ్యాన్ని ఆహుతిచ్చాను
నేను సైతం కాంగ్రెస్‌ అవినీతికి పద్దెనిమిది సీట్లను ధార ఓశాను
నేను సైతం 'అమ్మ' గారి జగన్‌ ఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మోశాను 

  •  
అరచేత్తో సూర్యకాంతిని ఆపొచ్చు 

1 comment:

  1. గురువుగారూ, ఇటు ఓ లుక్కేసి మీ అభిప్రాయం చెప్పండి
    http://blogavadgeetha.blogspot.com/2011/02/blog-post.html

    ReplyDelete