తెలుగు సినిమాల్లో కామెడీ సెటైర్లకు పెట్టింది పేరు కృష్ణభగవాన్. సినిమాల్లో సెటైర్లు వేసి ప్రేక్షకులకు నవ్విస్తారు. కృష్ణభగవాన్ ఉంటే కామెడీ పండుతుంది. కామెడీ సినిమా అయితే ఇక చెప్పనక్కర్లేదు. సహజ దర్శకుడు వంశీ సినిమా అనగానే గోదావరి, కృష్ణభగవాన్ గుర్తుకొస్తారు. ఎంతటివారైనా ఎక్కడోక్కడ తప్పులో కాలేస్తారని, నిజ జీవితంలోనూ నవ్వులపాలవుతారన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా కృష్ణభగవానే. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని ఒక ప్రైవేట్ కాలేజీకెళ్లారాయన. సినిమా యాక్టర్ తన ఫ్రండ్ కదా అని కాలేజీ యజమాని విద్యార్థులకు పర్సనాలిటీ డెవప్‌మెంట్‌పై పాఠాలు చెప్పించడానికి పిలిచారు. విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన ఈ అతిథి 'మత్తు' మాటలు చెప్పారు.
కమెడియన్ కాబట్టి తను నటించిన సినిమాల్లోని డైలాగులు చెబుతారనుకుంటే ఫుల్లుగా చల్లని బీరు తాగి తడిగుడ్డ వేసుకోవడంపై పర్సనాల్టీ డెవలప్ అవుతుందని సెలవిచ్చారు. ఒక సాహితీవేత్తపై అవాకులు చవాకులు పేలారు. వింతగా ప్రవర్తించారు. ఏదో సొల్లువాగుడు వాగారు. 'ఫుల్లు'గా 'ఫుల్లు' కొట్టినందువల్లనే కృష్ణభగవాన్ వికృతంగా ప్రవర్తించారంటున్నారు. ఆ కమెడియన్ వింత చేష్టలు కొన్ని టీవీల్లో ప్రసారమయ్యాయి. సినిమా యాక్టర్లు ఏం చేసినా చెల్లుతుందనుకుంటే పొరపాటు. అందులోనూ విద్యార్థుల వద్ద ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే చెప్పుదెబ్బలు ఖాయం. ఫుల్లు కొట్టిన సదరు కమెడియన్‌ను ఎందుకు స్టేజీ ఎక్కించారో ఆ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సమాధానం చెప్పాల్సి ఉంది.

please watch
ReplyDeletehttp://bookofstaterecords.com/
for the greatness of telugu people.