Friday, December 3, 2010

జగన్‌ సక్సెస్‌ అవుతారా?

ఆన్సర్‌ మై క్వచ్చన్‌.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్‌ కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా కనబడుతోంది. పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల్లోపు పార్టీ పెడతారని, త్వరలో ప్రకటన ఉంటుందని జగన్‌ మౌత్‌పీస్‌ అంబటి రాంబాబు పేర్కొన్నారు. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన మరుక్షణం నుండి ఆయన పెట్టబోయే పార్టీపై ఊహాగానాలోస్తున్నాయి. 'వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌' పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్‌ చేయించుకున్న వ్యక్తి ఆ పేరును జగన్‌కు అంకితమిస్తానంటున్నారు. జగన్‌ కొత్త పార్టీ పేరేంటి, అది ఎలా ఉండబోతోందన్న విషయాలు  రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పేరు దాదాపు ఖరారైందంటున్నారు. 'వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌'లో వైఎస్‌ఆర్‌ అంటే వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుకోవచ్చు లేదా 'యువజన శ్రామిక రైతు' అయినా అనుకోవచ్చు.  రెండు అర్థాలొచ్చేటట్లు పేరు పెట్టారంటున్నారు.


పార్టీ పేరు ఏదైనా జగన్‌ ఏ మేరకు సక్సెస్‌ అవుతారనేదే ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలకు కొదవ లేదు. మాఘలో పుట్టి పుబ్బలో అస్తమించిన పార్టీలు చాలానే ఉన్నాయి. అత్యంత ప్రభావం చూపినవీ లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక తెలంగాణ సాధన కోసం తొలుత మర్రి చెన్నారెడ్డి 'తెలంగాణ ప్రజాసమితి' పెట్టి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆయనే నేషనల్‌ డెమొక్రటిక్‌ పార్టీని సైతం స్థాపించి కాంగ్రెస్‌లో కలిపారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో 'రెడ్డి కాంగ్రెస్‌ 'వచ్చి కాంగ్రెస్‌లో విలీనమైంది. ఎన్టీఆర్‌ పెట్టిన 'తెలుగుదేశం' రాష్ట్ర రాజకీయాలను మార్చేసింది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నెల రోజులు సిఎం అయిన నాదెండ్ల భాస్కరరావు 'ప్రజాస్వామ్య తెలుగుదేశం' ఏర్పాటు చేసి చతికిలపడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. టిడిపిని విభేదించిన జానారెడ్డి 'తెలుగునాడు' పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. మాజీ ఐపిఎస్‌ ఎంవి భాస్కరరావు, ముద్రగడ పెట్టిన 'కాపునాడు' పత్తా లేదు. టిడిపి నుండి బయటికొచ్చిన రేణుకా చౌదరి 'టిడిపి-2నెలకొల్పి తర్వాత కాంగ్రెస్‌ బాట పట్టారు. ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ 'అన్న తెలుగుదేశం' రద్దుకాగా, లక్ష్మీపార్వతి 'ఎన్టీఆర్‌ తెలుగుదేశం (ఎల్‌పి)' నామమాత్రంగా కూడా లేదు.

టిడిపిని వీడిన కెసిఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌), టిఆర్‌ఎస్‌ను వీడిన నరేంద్ర-తెలంగాణ సాధన సమితి (టిఎస్‌ఎస్‌)ని ఏర్పాటు చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం, దేవేందర్‌గౌడ్‌ 'నవ తెలంగాణ', విజయశాంతి- 'తల్లి తెలంగాణ', మంద కృష్ణ పార్టీ ఏమ్మర్పిస్ సరేసరి. బిఎన్‌రెడ్డి-సిపిఎం, ఓంకార్‌-ఎంసిపిఐ, డికె అరుణ-సమాజ్‌వాదీ, కొమిరెడ్డి-రాష్ట్రీయ జనతాదళ్‌, ఎన్జీరంగా- స్వతంత్ర, క్రిషీకార్‌ అయాసమయాల్లో ప్రభావం చూపాయి. ఎంఐఎం,  ఎంబిటి, లోకసత్తా హైదరాబాద్ కి పరిమితం అయ్యాయి.  కాసాని 'మనపార్టీ' కాంగ్రెస్ లో విలీనం అయింది. ఇవికాక నక్సల్‌ పార్టీలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, పిఆర్‌పి మాత్రమే ఇప్పటి వరకూ అత్యధికంగా ప్రభావం చూపిన పార్టీలు. మిగిలినవాటి జీవనకాలం చాలా తక్కువ. ఇప్పుడు జగన్‌ పెడుతున్న కొత్తపార్టీపై కాలమే నిర్ణయించాలి.

6 comments:

  1. The answer depends on What would be considered as success?

    In general, My answer is YES.

    ReplyDelete
  2. Loksatta ni manchi party ni marchipoi ekkado epudo putti kalagarbham lo kalisipoina party la gurinchi icharu.. manalanti vallu kuda alanti 1 in 10000 partylani pattinchukokapote inka ela bagupadatam..

    ReplyDelete
  3. ముందుగా ఇన్ని ప్రాంతీయ పార్టీల సమాచారం అందించినందుకు కృతజ్ఞతాభినందనలు.
    పబ్లిక్ మెమొరీ షార్ట్ అంటారు.
    మీరు గుర్తు చేసేవరకూ ఈ పార్టీల సంగతి గుర్తే లేదు.
    తెలంగాణాకు జై కొట్ట కుండా తెలంగాణా లో జగన్ తన దుకాణం తెరవడానికే చాన్స్ లేదు.
    కేవలం సాను భూతి మీద ఆధార పడి పుట్టే పార్టీ ఎంతోకాలం మనుగడ సాగించలేదు.
    వై ఎస్ రాజ శేఖర రెడ్డి 2008 ఎన్నికలలో గెలిచాడన్నమాటే కానీ 2004 తో పోలిస్తే ఆయన పతనం కొట్టోచ్చినట్టు కనిపిస్తుంది.
    అసెంబ్లీ సీట్ల సంఖ్య తగ్గి పోవడమే కాదు,
    తెలంగాణా ప్రాంతం లో ఎన్నికలు ముగియగానే తెలంగాణా విషయం లో బోడిమల్లన్న మాదిరిగా " వీసా.. గీసా " అంటూ అవాకులూ చవాకులూ పేలి తన ప్రతిష్టను తానే దెబ్బ తీసుకుని
    చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు అత్తెసరు సీట్లతో గెలిచాడు.

    అర్ధంతర మరణం , పైగా దాని గురించి రెండు రోజుల పాటు దుర్భర సస్పెన్స్ .. వల్ల ఇంత క్రేజీ ఏర్పడింది కానీ
    బతికుంటే కేంద్రం లో "రాజా" లాగా రాష్ట్రం లో ఆయన అవినీతి బట్టబయలై పోయి వుండేది.

    కోట్లు ఖర్చుపెట్టి, పంచి పెట్టి ప్రచారం చేసుకునే సత్తా వల్ల జనాలు భారీగానే మూగుతుండ వచ్చు
    నిన్న చిరంజీవి విషయంలో కూడా అదే జరిగింది.
    సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఏదో ఘోరాతి ఘోరమైన తీరని అన్యాయం చేసిందంటే మెడకాయ మీద తలకాయ వున్నవాడేవడూ నమ్మడు.
    ఓట్లు రాలవు.
    కాబట్టి జగన్ సక్సెస్ కావడం కల్ల..

    ReplyDelete
  4. Jagan has taken googstep. He will become a leader like NTRamarao.

    ReplyDelete