Friday, December 17, 2010

మౌనమేలనోయి వివేకా!

అసెంబ్లీలో ఆరు రోజులుగా రైతుల గురించి చర్చ జరగడమో లేక ఆ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయడమో జరిగాయి. మూడు రోజుల పాటు చర్చించాక ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి సమాధానం చెప్పారు. విశేషమేంటంటే రైతుల సమస్యపై వ్యవసాయ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మాత్రం నోరు తెరవలేదు. సహజంగా రైతుల గురించి వ్యవసాయ మంత్రి మాట్లాడతారు. ఒకవేళ రెవెన్యూ మంత్రి, సిఎం మాట్లాడినప్పటికీ వ్యవసాయ మంత్రి ఏదోక సమయంలో జోక్యం చేసుకోవడం ఆనవాయితీ. వివేకా విషయంలో ఆ సంప్రదాయం అటకెక్కింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు రసవత్తరంగా సభలో చర్చ జరుగుతుంటే వ్యవసాయ మంత్రి కానరాలేదు. జీరోఅవర్‌ సమయంలో శాసనసభలో తచ్చాడిన ఆయన ఆ తర్వాత మాయమయ్యారు. ఎమ్మెల్సీ అయిన వివేకాను కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా శాసనమండలిలో పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా నియమించింది. అందుకే మండలిలో ఆయన బిజీగా ఉన్నారేమోననుకుంటే పొరపాటే. మండలిలో రైతులపై ప్రత్యేకంగా చర్చించలేదు. 

శాసనసభలో రైతులకు సిఎం, రఘువీరా ప్యాకేజీ ప్రకటించారు కాబట్టి మండలిలో వివేకా ప్యాకేజీ ప్రకటించారా అంటే అదీ లేదు. అక్కడ మంత్రి జానారెడ్డి ప్యాకేజీ వివరాలు చదివి వినిపించారు. కిరణ్‌కుమార్‌, రఘువీరా వంటి వారు వైఎస్‌ పేరు చెప్పి ఆయన చెప్పిన విధంగా రైతు రాజ్యాన్ని కొనసాగిస్తామంటూ వైఎస్‌ మంత్రం జపించగా వివేకా మూగనోము పట్టారు. వైఎస్‌ ఆశయాలు సాధించడానికే వ్యవసాయ మంత్రి పదవి అధిష్టించానని చెప్పుకున్న వివేకా రైతు సమస్యలపై ఎందుకు గొంతెత్తలేదు? ఉద్దేశ పూర్వకంగానే ఆయన నోరు పెగల్లేదా లేక కాంగ్రెస్‌ పార్టీ ఆయనను దూరం పెట్టిందా? కొత్తగా మంత్రి అయ్యారు కనుక అనుభవం లేదని ముఖ్యమంత్రే మాట్లాడనివ్వలేదా?

8 comments:

  1. దీన్ని బట్టి వివేకా మంత్రి అయ్యింది కేవలం కుటుంబంలోని గుట్టుమట్టులను శత్రుపక్షానికి లీక్ చేయడానికేనని స్పష్టంగా అర్థమవుతోంది. దానికి మరో రుజువు కూడా వుంది. రెండు రోజుల క్రితం కడప జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఒక ఎమ్మెల్సీ, మరో ఎమ్మెల్యే కలిసి కడపలో జగన్ను ఏ విధంగా ఓడించాలనేదానిపై మంత్రాంగం చేయడం. అయితే కడప జిల్లాలో వివేకాకు పెద్ధ పట్టు లేదనే విషయం కూడా గత రెండు మూడు రోజుల క్రితం ఆంధ్రభూమిలో ప్రచురితమైన ఆయన ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది.

    ReplyDelete
  2. ‘‘ ఇంటర్వ్యూ వివరాలు........
    ప్రశ్న: అత్యంత కీలకమైన కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనుకుంటున్నారు?
    జవాబు: ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కష్టమే, పులివెందుల అసెంబ్లీ స్థానం కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటోంది, అలాగే కడప లోక్‌సభ నియోజకవర్గం కూడా ఒకటి రెండు సార్లు ఓటమి చెందినా ఈ స్ధానం కూడా కాంగ్రెస్‌కు కంచుకోటే. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ఉంటుందన్నది చెప్పలేం.
    ప్ర: జగన్ పార్టీ రెండు చోట్లా విజయం సాధిస్తుందంటారా?
    జ: కాంగ్రెస్‌కు, జగన్‌కూ కూడా కష్టమే, మారిన రాజకీయ పరిణామాల్లో ప్రజలు ఎటు మొగ్గు చూపిస్తారన్నది చెప్పలేం, జిల్లా ప్రజల్లో వైఎస్ పట్ల విశేష అభిమానం ఉంది. వైఎస్ కుమారుడు జగన్ కొత్త పార్టీ పెడుతున్నాడు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారా? జగన్‌వైపు వెళతారా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం.
    ప్ర: మీ కుటుంబ సభ్యులు ఎవరి పక్షం, పులివెందుల ప్రజలు ఎవరి వైపు ఉండవచ్చు?
    జ: మా కుటుంబంలో నేను తప్ప మిగిలిన అందరూ జగన్ వైపే ఉన్నారు. దీనికి అనుగుణంగానే పల్లెల్లో ప్రజల వైఖరి కూడా ఉంటుంది.
    ప్ర:ఉప ఎన్నికలు తమ పార్టీకి సెమీ ఫైనల్స్‌ని జగన్ అంటే మీరు, మీ రాజకీయ జీవితానికి ఫైనల్స్ అని ప్రకటించారు. అంటే ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారా?
    జ: అలాంటిది ఏమీ లేదు. ఉప ఎన్నికల్లో సీరియస్‌నెస్‌ను తీసుకురావడానికి అలా అన్నా. ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధించి, జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినా నేను రాజకీయాల నుంచి తప్పుకోను, కాంగ్రెస్ పార్టీని వదలను. కాంగ్రెస్ గెలిచినా, ఓడినా జగన్ పార్టీలో చేరే ప్రశే్న లేదు. కాంగ్రెస్ ఓటమి చెందితే ప్రతిపక్షంలో ఉంటా.
    ప్ర: జగన్‌కూ, మీకూ మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటి?
    జ: నా ఆలోచనలు నావి, జగన్ ఆలోచనలు జగన్‌వి. అయితే నేను తీసుకునే నిర్ణయాలే గురించి జగన్‌కు చెప్పేవాడిని కాదు,జగన్ తీసుకునే నిర్ణయాలు నాకు చెప్పే వాడు కాదు. అలా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది, కాంగ్రెస్ అధిష్ఠానానికి, జగన్ మధ్య దూరం పెరిగినట్టే మా ఇద్దరి మధ్య కూడా దూరం పెరిగింది.

    ReplyDelete
  3. ‘‘ ఇంటర్వ్యూ వివరాలు........

  4. ‘‘ ఇంటర్వ్యూ వివరాలు.......

  5. ‘‘ ఇంటర్వ్యూ వివరాలు.......
    ప్ర: వైఎస్ మా ఆస్తి అని కాంగ్రెస్ అంటుంటే వైఎస్ వారసుడిని నేనే అని జగన్ అంటున్నారు. మరి వైఎస్‌ను ఎవరు ‘ఓన్’ చేసుకోగలుగుతారు?
    జ: వైఎస్ ముఖ్యమంత్రిగా అనేక పథకాలు చేపట్టి ప్రజల హృదయాల్లోకి వెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ అంటే ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉంది, కడప జిల్లా ప్రజల్లో కూడా వైఎస్ అంటే అభిమానం ఉంది. జగన్ ఆయన కుమారుడు, మరి ఈ పరిస్థితిలో వైఎస్ అభిమానులు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారా, లేక జగన్‌కు మద్దతు ఇస్తారా అన్నది చెప్పడం కష్టం.
    ప్ర: వైఎస్ మరణించిన తర్వాత ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన డిఎల్, శంకరరావు వంటి వారికి మంత్రి పదవులు ఇచ్చారు, వైఎస్ రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని డిఎల్ ఆరోపణలు చేశారు, ఉప ఎన్నికల్లో డిఎల్ వంటి వారు ప్రచారం చేస్తే వైఎస్ అభిమానులు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారంటారా?
    జ: అది మీరే విశే్లషణ చేయాలి, నేను అంత దూరం ఆలోచించలేదు.
    ప్ర: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారు?
    జ: అధిష్ఠానం ఎవరిని నిర్ణయిస్తే వారు చేస్తారు. అభ్యర్ధుల వరకు మేం ఇంకా రాలేదు.
    ప్ర: వైఎస్ కుటుంబాన్ని చీల్చడానికే మా బాబాయికి అధిష్ఠానం మంత్రి పదవి ఇచ్చిందన్న జగన్ ఆరోపణకు మీ సమాధానం?
    జ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్నో త్యాగాలు చేశారు. ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు రెండు సార్లు వచ్చినా ఆమె తిరస్కరించారు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఎటువంటి పదవి ఆశించకుండా పార్టీకోసం పని చేస్తున్నారు. ఇందిరాగాంధీ కుటుంబం గురించి ప్రపంచంలో ఆందరికీ తెలిసిందే, అలాంటి కుటుంబానికి చెందిన సోనియాగాంధీ వైఎస్ కుటుంబాన్ని చీల్చడానికి ప్రయత్నించారన్న ఆలోచన చేయడమే తప్పు, ఆ అవసరం ఆమెకు ఏముంది?
    ప్ర: మరి మంత్రి పదవి మీకు ఎలా వచ్చింది?
    జ: నేను మంత్రి పదవిని ఆశించకూడదా? నేనే స్వయంగా సోనియాగాంధీని కలిసి మంత్రి పదవి కావాలని కోరాను. నా మీద నమ్మకంతో ఆమె నాకు మంత్రి పదవి ఇచ్చారు.
    ప్ర: ఇంతకాలంగా మీరు రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ ఏ పదవి అడగలేదు. ఇప్పుడు మంత్రి పదవి కావాలని ఎందుకు అనుకున్నారు?
    జ: నేను మంత్రి పదవికి కోరుకోడానికి రెండు కారణాలు ఉన్నాయి. వైఎస్ చేపట్టిన పధకాలు అన్నిటిని ప్రభుత్వం సక్రమంగా అమలు జరిగాలంటే నేను మంత్రిగా ఉంటే వీలవుతుందని భావించా. అన్నకు (వైఎస్‌కు) నిజమైన నివాళి అంటే ఆయన చేపట్టిన అన్ని పధకాలను పూర్తి చేసినప్పుడే. ఇక రెండోది, జగన్‌రెడ్డికి, అధిష్ఠానానికి మధ్య దూరం పెరిగింది, వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి మంత్రిగా ఉంటే సాధ్యపడవచ్చని అనుకున్నా, అందుకే మంత్రి పదవి కావాలనుకున్నా.
    ప్ర: వైఎస్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందదన్న నమ్మకం మీకుందా?
    జ: రోశయ్య హయాంలో వైఎస్ పధకాల అమలులో స్తబ్దత ఏర్పడింది, ఇలా అయితే వైఎస్ అనుకున్న పథకాలు అమలు సాధ్యం కాదు, తద్వారా కాంగ్రెస్ దెబ్బతింటుందని అనుకున్నా, ఇప్డుడు నేను మంత్రి అయ్యాను కాబట్టి పధకాల్లో కదలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తా.
    ప్ర: కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వైఎస్ పధకాలను పూర్తి చేస్తుందన్న గట్టి నమ్మకం మీకుందా?
    జ: వైఎస్ చేపట్టిన పధకాలు అమలు కాకపోతే మేం అదరం మునుగుతాం, కాంగ్రెస్ పార్టీ కూడా మునుగుతుంది.’’

    దీన్ని బట్టే తెలుస్తుంది ఆయన ఉద్దేశ్యాలు, అధిష్టానం ఏ మేరకు ప్రభావితం చేసింది.

    ReplyDelete
  6. ‘‘ ఇంటర్వ్యూ వివరాలు.......

  7. ‘‘ ఇంటర్వ్యూ వివరాలు.......

  8. rajababu gariki...coments post chesinanduku thanks. chala kastapadi paper intervew post chesaru.

    ReplyDelete