Tuesday, December 28, 2010

ఎందుకీ దీక్షల డ్రామా?!

సంవత్సర కాలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యమకారులపై నమోదైన పోలీస్‌ కేసుల ఎత్తివేతకు కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టిన నిరవధిక దీక్షలు కామెడీ షోను తలపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీ చేతిలో ఉంటే ఆందోళన చేపడితే అర్థం చేసుకోవచ్చు. రెండు చోట్లా అధికారంలో తామే ఉండి తామే కేసుల ఎత్తివేతకు దీక్షలు చేపట్టడం వెనుక మతలబు ఎంటనేది ప్రశ్న. పొలిటికల్‌ మైలేజ్‌ కోసమే ఈ డ్రామా అని విమర్శలొస్తున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కేసుల ఎత్తివేత కోసం టిఆర్‌ఎస్‌ ఆందోళన చేసింది. 
 
మూడు రోజులపాటు సభ స్తంభించిన తర్వాత నాన్‌ సీరియస్‌ కేసులను ఎత్తి వేస్తున్నట్లు సభలో సిఎం, హౌం మంత్రి ప్రకటించారు. అన్ని కేసులనూ ఎత్తివేయాలని టిఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కేసులు ఎత్తివేయాలని దీక్షలు చేపట్టారు. ఇంటి దొంగలే ద్రోహులంటూ తెలంగాణ కాంగ్రెస్‌, టిడిపి నేతలపై టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ నిప్పులు చెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షలు చేపట్టి తానేమీ తెలంగాణ సాధనలో తక్కువ కాదన్నట్లు కలర్‌ ఇస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం అవి విఫలం కావడం, మంత్రులు దీక్షా శిబిరం వద్దకెళ్లి మాట్లాడటం, సిఎం పార్టీ హైకమాండ్‌తో మాట్లాడటం, పిసిసి అధ్యక్షుడు డిఎస్‌ దౌత్యం చేసినట్లు నటించడం చూస్తుంటే డ్రామా తలపిస్తోంది. హైకమాండ్‌ చెబితే సిఎం కేసులు ఎత్తివేయకుండా ఉంటారా? సిఎం తలచుకుంటే సీమాంధ్ర నేతలు అడ్డు తగులుతారా? అధిష్టానమే శిరోధార్యమని నిత్యం వల్లించే సోనియా వీర భక్తులు అదే సోనియా గుడ్లురిమితే దీక్షలు విరమించకుండా ఉంటారా? కొసమెరుపు... కేసులు ఎత్తివేస్తే ఊరుకునేది లేదని సీమాంధ్రలోని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

2 comments:

  1. ఎందుకీ దీక్షల డ్రామా?********
    సమాధానాలు తెలిసీ అన్యాపదేశంగా వాటిని సూచిస్తూనే భలే ప్రశ్నలు వేసారు.

    >>>>కేసులు ఎత్తివేస్తే ఊరుకునేది లేదని సీమాంధ్రలోని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. <<<<

    ఇదిగో ఈ ఒక్క ముక్క చాలు కాంగ్రెస్ అనేది ఒకే పార్టీ కాదు దానికి ఒకే ముఖం, ఒకే ఎజెండా లేదు అని చెప్పటానికి.

    గత సంవత్సరం డిసెంబర్ ౯ ప్రకటనకు ముందు
    అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని,
    నిర్ణయాధికారం సోనియా చేతిలో పెడుతూ
    ఆమె ఎ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని
    ఏక వాక్య తీర్మానం చేసిన ప్రబుద్ధులే
    కేంద్రం నిర్ణయం ప్రకటించగానే రాజీనామాల డ్రామా ఆడటం,
    తమ మాటనే కాదు అధిష్టానాన్ని బాహాటంగా దిక్కటించిన విషయం గుర్తుంది కదా.

    ఆంధ్రా కాంగ్రెస్ నాయకులకు లేని అధిష్టానం మీకెందుకు అని,
    ఎన్నాళ్ళీ బానిస బతుకులు అని
    ఒక్క కే సి ఆరే కాదు
    తెలంగాణా ప్రజలంతా చీత్కారించు కుంటుంటే ,
    కాళ్ళ కింది భూమి కదిలి పోతుంటే ...
    ఇన్నాళ్ళకు మావాళ్ళకు రోషం పొడుచుకొచ్చింది.

    అది ఎన్నాల్లున్తుందో చూడాలి

    అనివార్యం డ్రామా
    అనివార్యం యుద్ధం
    అనివార్యం తెలంగాణా ఏర్పాటు.

    ReplyDelete
  2. డ్రామా అనివార్యమా లే క డ్రామా వదిలి వాస్తవంలోకి రావాలా

    ReplyDelete