గతంలో టాలీవుడ్ అంటే 'రాముడు మంచి బాలుడు' అన్న పేరుండేది. రాను రాను టాలీవుడ్ సైతం బాలీవుడ్ సరసన చేరిపోతోంది. సమీప భవిష్యత్తులో బాలీవుడ్‌ను మించిపోయే ప్రమాదం ఉంది. టాలీవుడ్ నేరస్తులకు అడ్డాగా మార్పు చెందుతోంది. భూకబ్జాల దగ్గర నుండి వ్యభిచారం, డ్రగ్స్ వరకూ అన్ని రకాల క్రైమ్‌లకూ ఆలవాలమైంది. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూరి ఇటీవల హైదరాబాద్‌లో హత్యకు గురయ్యాడు. సూరి హత్య కేసును తొవ్వినకొద్దీ తెలుగు సినిమా పరిశ్రమ నుండి నేరస్తులు ఒక్కొక్కరు బయటికొస్తున్నారు. సూరిని హత్య చేసిన భాను టాలీవుడ్ కేంద్రంగా సాగించిన దాందాలకు అడ్డూ అదుపు లేదు. భానుకు పలువురు సినిమా ప్రముఖులు వెన్నంటి ఉన్నారు.
నిర్మాతలు సి. కళ్యాణ్, సింగనమల రమేష్‌తో సహా పలువురి పేర్లు ఇప్పటికే బయటికొచ్చాయి. వారిని పోలీసులు విచారిస్తున్నారు. వీడియో హక్కులు, సినిమా హక్కులు, భూకబ్జా, సెటిలిమెంట్లు ఒకటేమిటి భానుతో కలిసి సినీ ప్రముఖులు సాగించిన చీకటి కార్యక్రమాలకు లెక్కే లేదు.
డ్రగ్స్ వ్యాపారంలోనూ సినిమా ప్రముఖులు పోలీసులకు దొరుకుతున్నారు. ఆ మధ్య నటుడు రవితేజ సోదరులు డ్రగ్స్ కొనుక్కుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇప్పుడు నటి జీవిత సోదరుడు, నిర్మాత కూడా అయిన మురళి సైతం డ్రగ్స్ కొనుగోలు చేస్తూ దొరికిపోయారు. డ్రగ్స్ అమ్ముతున్నారో, కొంటున్నారో పోలీసులు స్పష్టం చేయట్లేదు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రముఖ నటీ, నటులు సైతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఇక ఛోటా మోటా నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సైడ్ హీరోలు, హీరోయిన్లు కూడా డ్రగ్స్‌కు, పబ్ పార్టీలకు అలవాటు పడ్డారని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్‌పై ఆధారపడి డ్రగ్స్ మాఫియా తమ కార్యక్రమాలును విస్తరిస్తోందని పోలీసులు చెబుతున్నారు.
సినిమా పరిశ్రమలోనే కాదు టీవీ ఛానళ్లు వృద్ధి అయ్యాక ఆ రంగంలోనూ మాఫియా, నేర సామ్రాజ్యం పెరిగిపోతోంది. ఒక టీవీలో పని చేస్తున్న యాంకర్ శ్వేతారెడ్డికి, సూరి అనుచరుడు భానుకు మధ్య సంబంధాలున్నాయని పోలీసులే వెల్లడించారు.
ఇవన్నీ బయటికొచ్చిన సంఘటనలు. బయటికి రానివి ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్‌లో చిన్న చితకా మాత్రమే కాదు ప్రముఖులు సైతం మాఫియా కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. తమ నేరాలకు ప్రభుత్వంలోని 'పెద్ద'లను, పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. దొరకనంతకాలం దొర..దొరికితేనే దొంగ...ఇదీ టాలీవుడ్ పరిస్థితి.

No comments:
Post a Comment