సంవత్సర కాలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యమకారులపై నమోదైన పోలీస్ కేసుల ఎత్తివేతకు కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన నిరవధిక దీక్షలు కామెడీ షోను తలపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీ చేతిలో ఉంటే ఆందోళన చేపడితే అర్థం చేసుకోవచ్చు. రెండు చోట్లా అధికారంలో తామే ఉండి తామే కేసుల ఎత్తివేతకు దీక్షలు చేపట్టడం వెనుక మతలబు ఎంటనేది ప్రశ్న. పొలిటికల్ మైలేజ్ కోసమే ఈ డ్రామా అని విమర్శలొస్తున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కేసుల ఎత్తివేత కోసం టిఆర్‌ఎస్ ఆందోళన చేసింది.
Tuesday, December 28, 2010
Monday, December 27, 2010
Sunday, December 26, 2010
జగన్ భయపడుతున్నారేమో!
జగన్మోహనరెడ్డి కడప, పులివెందుల ఉప ఎన్నికలపై భయపడుతున్నారా? ఎందుకంటే జగన్ కాంగ్రెస్‌ను వీడినప్పటి నుండి తన చిన్నాన్న వివేకానందరెడ్డితో సయోధ్య కోసం పలుమార్లు ప్రయత్నిస్తుంటే సహజంగా ఎవరికైనా ఈ డౌటు వస్తుంది. తన కుటుంబాన్ని కాంగ్రెస్ హైకమాండ్ చీల్చిందని జగన్ ఆరోపిస్తుంటే అదేం లేదు నేనే సోనియాకు మాటిచ్చానంటున్నారు వివేకా. వైఎస్ ఆశయాలు సాధించడం కోసమే మంత్రి పదవి తీసుకున్నానన్నారు. ఇప్పటికి వివేకాతో పలుమార్లు భేటీలు జరిగాయి. జగన్ మామ గంగిరెడ్డి ఇంట్లో మూడు నాలుగు తడవలు సమావేశాలు జరిగాయి. వివేకాకు జగన్‌కు మధ్య సయోధ్య కుదిరిందని మీడియాలో స్క్రోలింగ్‌లు రాగా కొద్దిసేపటికే వివేకా ఆ వార్తలను ఖండించడం జరిగింది.
Saturday, December 25, 2010
ఆ 400 కోట్లు ఎవరి దీక్ష పుణ్యం?
కాంగ్రెస్ మాజీ ఎంపి వైఎస్ జగన్ రెండు రోజుల లక్ష్య దీక్ష, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు ముగిశాయి. ఇద్దరిలో ఎవరి దీక్షకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉందనేది ప్రజలు ముఖ్యంగా రైతులు తేలుస్తారు. రైతులను ఉద్ధరించాలన్న మంచి ఉద్దేశం తమకుందంటే తమకుందని జగన్ మద్దతుదార్లు, టిడిపి నేతలు బజారునపడి వాదించుకుంటున్నారు. పాపం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌దే విచిత్ర సంకటం. అటు జగన్‌ను, ఇటు తెలుగుదేశాన్ని తిట్టాల్సివస్తే ఏరోజుకారోజు అప్పుడు ఎదురైన పరిస్థితులను బట్టి స్పందిస్తోంది. జగన్ ఇంకా పార్టీ పెట్టలేదు, కాని కాంగ్రెస్‌ను వీడారు కనుక టిడిపి, కాంగ్రెస్‌ను రాజకీయ ప్రత్యర్ధులుగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
Wednesday, December 22, 2010
ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా?
వైఎస్ జగన్ విజయవాడలో ప్రారంభించిన లక్ష్య దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా? అసెంబ్లీలో కాంగ్రెస్, బయట జగన్ అంటున్న ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపు చట్టం వర్తిస్తుందా? ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకాన్ని, మరీ ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులను, మరీ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను బుర్రలు బద్దలు కొడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఓదార్పుయాత్ర చివరిరోజు రాజమండ్రిలో జరిగిన జగన్ బహిరంగసభలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇప్పుడు విజయవాడలో కూడా ఒకరిద్దరు పెరిగినా తగ్గినా 25 మంది ఎమ్మెల్యేలైతే పక్కాగా మంగళవారంనాటి లక్ష్యదీక్షకు మద్దతిచ్చారు. నలుగురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సరేసరి.
Sunday, December 19, 2010
కృష్ణభగవాన్ 'ఫుల్లు' కొట్టారు
తెలుగు సినిమాల్లో కామెడీ సెటైర్లకు పెట్టింది పేరు కృష్ణభగవాన్. సినిమాల్లో సెటైర్లు వేసి ప్రేక్షకులకు నవ్విస్తారు. కృష్ణభగవాన్ ఉంటే కామెడీ పండుతుంది. కామెడీ సినిమా అయితే ఇక చెప్పనక్కర్లేదు. సహజ దర్శకుడు వంశీ సినిమా అనగానే గోదావరి, కృష్ణభగవాన్ గుర్తుకొస్తారు. ఎంతటివారైనా ఎక్కడోక్కడ తప్పులో కాలేస్తారని, నిజ జీవితంలోనూ నవ్వులపాలవుతారన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా కృష్ణభగవానే. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని ఒక ప్రైవేట్ కాలేజీకెళ్లారాయన. సినిమా యాక్టర్ తన ఫ్రండ్ కదా అని కాలేజీ యజమాని విద్యార్థులకు పర్సనాలిటీ డెవప్‌మెంట్‌పై పాఠాలు చెప్పించడానికి పిలిచారు. విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన ఈ అతిథి 'మత్తు' మాటలు చెప్పారు.
Saturday, December 18, 2010
వైఎస్ తొలి సంతకం దేనిపై పెట్టారు?
రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి సంతకం ఏ ఫైల్‌పై పెట్టారు? 2004 మే 16న ఎల్బీ స్టేడియంలో మొదటిసారి సిఎంగా ప్రమాణం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్‌పై వైఎస్ తొలి సంతకం పెట్టారు. 2009 మే 20న ఎల్బీ స్టేడియంలో రెండోసారి సిఎంగా ప్రమాణం చేశాక ఉచిత విద్యుత్‌ను ఏడు గంటల నుండి తొమ్మిది గంటలకు పెంచుతూ వైఎస్ తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని ఆ రోజు సభకు హాజరైన జనాలకు చెప్పారు. ప్రజల సమక్షంలోనే ఫైల్‌పై సంతకం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రెండే కొత్త హామీలిచ్చారు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, రేషన్ బియ్యం నాలుగు కిలోల నుండి ఆరు కిలోలకు పెంపు. ఈ రెండింటినీ త్వరలో అమలు చేస్తానని చనిపోవడానికి కొద్దిరోజుల ముందు జర్నలిసల్టులు అడిగిన ప్రశ్నకు వైఎస్ చెప్పారు.
Friday, December 17, 2010
మౌనమేలనోయి వివేకా!
అసెంబ్లీలో ఆరు రోజులుగా రైతుల గురించి చర్చ జరగడమో లేక ఆ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయడమో జరిగాయి. మూడు రోజుల పాటు చర్చించాక ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి సమాధానం చెప్పారు. విశేషమేంటంటే రైతుల సమస్యపై వ్యవసాయ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాత్రం నోరు తెరవలేదు. సహజంగా రైతుల గురించి వ్యవసాయ మంత్రి మాట్లాడతారు. ఒకవేళ రెవెన్యూ మంత్రి, సిఎం మాట్లాడినప్పటికీ వ్యవసాయ మంత్రి ఏదోక సమయంలో జోక్యం చేసుకోవడం ఆనవాయితీ. వివేకా విషయంలో ఆ సంప్రదాయం అటకెక్కింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు రసవత్తరంగా సభలో చర్చ జరుగుతుంటే వ్యవసాయ మంత్రి కానరాలేదు. జీరోఅవర్ సమయంలో శాసనసభలో తచ్చాడిన ఆయన ఆ తర్వాత మాయమయ్యారు. ఎమ్మెల్సీ అయిన వివేకాను కాంగ్రెస్ వ్యూహాత్మకంగా శాసనమండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నియమించింది. అందుకే మండలిలో ఆయన బిజీగా ఉన్నారేమోననుకుంటే పొరపాటే. మండలిలో రైతులపై ప్రత్యేకంగా చర్చించలేదు.
Thursday, December 16, 2010
శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పబోతోంది?
ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఆందోళనల నేపథ్యంలో కేంద్రం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తుది రాష్ట్ర పర్యటన నేడు. హైదరాబాద్‌లో రోజంతా కమిటీ బిజీ బిజీ. గవర్నర్, సిఎం, అధికారులు, రాజకీయపార్టీలు, మీడియాతో వరుస భేటీలు. సాయంత్రానికే ఢిల్లీ పయనం. నేటి శ్రీకృష్ణ పర్యటన లాంఛనం. ఇంతవరకూ తమ అధ్యయనానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి పరిమితం. డిసెంబర్ 31న నివేదిక ఇస్తామని కమిటీ ఎప్పుడో ప్రకటించింది. డిసెంబర్ 31 తర్వాత ఏం జరుగుతుంది అని గవర్నర్‌ను ప్రశ్నిస్తే జనవరి 1 వస్తుంది అని తాపీగా జవాబైతే చెప్పారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొంటామని డిజిపి అరవిందరావు అంటుంటే, కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పైకైతే చెప్పారుకాని లోపల్లోపల మాత్రం సిఎం, ప్రభుత్వం ఆందోళనగానే ఉంది.
Wednesday, December 15, 2010
ఇప్పటి దాకా ఎంపీలు చేసింది మౌనదీక్ష కాదా?!
విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాల చివరి రోజున మౌనదీక్ష చేపట్టారంటూ మీడియాలో అమితంగా ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాదాపు ఆరున్నరేళ్లుగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఇంతకాలం చేసింది మౌనవ్రతమేకదా? కేంద్ర మంత్రులుగా ఉన్న ఎంపీలు సైతం అదే చేశారు. పొరుగు రాష్ట్రాలు ఇబ్బడిముబ్బడిగా నిధులు, రైల్వేలైన్లు, ఇతరత్రా పథకాలను, ప్యాకేజీలను తన్నుకుపోతుంటే మన ఎంపీలు, కేంద్ర మంత్రులు చోద్యం చూస్తున్నారు. మరీ సంవత్సరకాలంగా అయితే రాష్ట్రంలోనే సీమాంధ్ర, తెలంగాణా అంటూ విడిపోయి పైకి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. లోపల తమ స్వప్రయోజనాలు, లబ్ది చూసుకుంటున్నారు. ఎక్కడ తమ ప్రాంతంలో ఓట్లు పోతాయోనని తప్ప ఎంపీలు చేస్తున్న ప్రాంతీయ 'ఉద్యమాల్లో' ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడుతున్నట్లు పైకి ఫోజు పెడుతున్నారు. కాంగ్రెస్ వేదికలమీద తామంతా ఒకటేనని, సోనియా నాయకత్వమని బృందగానం ఆలపిస్తున్నారు. వీళ్లని ఎవరు నమ్ముతారు?
Monday, December 13, 2010
కిరణ్‌కు మెచ్యురిటీ కొరత!
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు నాలుగు తడవలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాజకీయంగా మెచ్యురిటీ కాలేదనిపిస్తోంది. ఎమ్మెల్యేగా, చీఫ్‌విప్‌గా, స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించినా సరిగ్గా రాజకీయాలు వంటబట్టించుకోలేదు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న నేత ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడుతున్నారు. సీనియర్ రాజకీయవేత్త నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి వారసుడైనప్పటికీ ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ నేతలకే అంతుబట్టకుండా ఉంది. వైఎస్ ఉన్నంత కాలం తండ్రిచాటు బిడ్డలా పదవుల్లో ఒదిగిపోయిన కిరణ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఊహించని రీతితో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే అసెంబ్లీలో, బయట మీడియా ముందు ఆయన స్పందిస్తున్న తీరులో మెచ్యురిటీ లోపిస్తోంది. స్పీకర్‌గా సంవత్సరంన్నర పని చేసి అందరి చేత అధ్యక్షా అని పిలిపించుకున్న కిరణ్, తాను సిఎం స్థానం నుండి మాట్లాడాల్సి వచ్చే సరికి ఆ మాట మర్చిపోయారు. నేరుగా టిఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలనుద్దేశించి మాట్లాడారు.
Sunday, December 12, 2010
సురేఖ లేఖ వెనుక ఎవరున్నారు?
వైఎస్ తన ఆత్మగా చెప్పుకున్న కెవిపి రామచంద్రరావును బ్రోకర్ అంటూ ఎమ్మెల్యే కొండ సురేఖ ఎందుకు లేఖ రాసినట్లు? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే లేఖాస్త్రం సంధించడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ సందేహాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్‌లో చర్చనీయాంశమయ్యాయి. సురేఖ లేఖపై ఇంతగా చర్చ జరగడానికి ఆరున్నరేళ్ల గత చరిత్రే కారణం. అదృశ్యశక్తి, భేతాళమాంత్రికుడు, ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు సూత్రధారి, జల (ధన)యజ్ఞానాకి రథసారధి, కలెక్షన్ కింగ్..ఇలా రాసుకుంటూ పోతే ప్రతిపక్షాలు, పత్రికలు కెవిపికి ఇచ్చిన బిరుదులు చాలానే ఉన్నాయి. ఎప్పుడూ వైఎస్ వెన్నంటి ఉండే ఆయన 'ఆత్మ'పై కాంగ్రెస్ నేతల నుండి సైతం విమర్శలొచ్చాయి. మంత్రివర్గం ఎంపిక నుండి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులకు టిక్కెట్లిచ్చే వరకూ, కార్పొరేషన్ పదవుల పందేరం దగ్గర నుండి పార్టీలో గల్లీ పదవుల వరకూ కెవిపి చక్రం తిప్పారంటారు కాంగ్రెస్ నేతలు. స్నేహమంటే ఇదేరా అన్న స్టయిల్‌లో వైఎస్, కెవిపి మైత్రిని ఫ్రెండ్‌షిప్‌డే రోజు పలు పత్రికలు ఫొటోలు వేసి మరీ ఆకాశానికెత్తాయి.
Friday, December 10, 2010
వివేకాకు ఆదిలోనే అవమానం?
వైఎస్ వివేకానందరెడ్డిని అప్పుడే కాంగ్రెస్ అవమానించిందా? సచివాలయంలో ఆయన కోరుకున్న ఛాంబర్ ఎందుకు కేటాయించలేదు? ఛాంబరే ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో వైఎస్‌ఆర్ లేని కాంగ్రెస్‌లో వివేకానందను తక్కువగా చూస్తారా? ఈ ప్రశ్నలు వైఎస్ అభిమానులను, కాంగ్రెస్ నేతలను, చివరికి సాధారణ పరిపాలనాశాఖను సైతం వేధిస్తున్నాయి. వైఎస్ జగన్‌కు చెక్ పెట్టేందుకు ఆయన కుటుంబాన్నే చీల్చింది కాంగ్రెస్. వైఎస్, వివేకానంద కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఉన్న విభేదాలను పార్టీ సొమ్ము చేసుకుందనే చెప్పాలి. ఒత్తి పెడితే ఏదోక రోజు ఎదురు కొడుతుంది, పిల్లిని గదిలోపెట్టి కొడితే దాడి చేస్తుంది అనే సామెతలు ఉండనే ఉన్నాయి. అలాగే దశాబ్దాలుగా అణిగిమణిగి ఉన్న వివేకా ఒక్కసారిగా జూలు విదిలించి జగన్‌కు వ్యతిరేకంగా మారి ఉంటారు. వైఎస్ కుటుంబ గొడవలెలా ఉన్నా జగన్ మాత్రం తనను దెబ్బకొట్టడానికి తమ కుటుంబంలో సోనియాగాంధీ చిచ్చు పెట్టారని మదనపడి కాంగ్రెస్‌ను వీడినట్లు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
Saturday, December 4, 2010
డిప్యూటిపై నాన్చుడెందుకు?
కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రశ్న రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు జరిగింది. కిరణ్‌కుమార్‌రెడ్డి అనుకోకుండా సిఎం అయ్యారు. సీమాంధ్రకు చెందిన కిరణ్ సిఎం కనుక తెలంగాణాకు డిప్యూటి సిఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ మీడియా ముఖంగా ప్రకటించారు. కేబినెట్ కూర్పుపై కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి సైతం 'డిప్యూటి' తెలంగాణాకు ఇస్తామని స్పష్టం చేశారు. దామోదర్ రాజనర్సింహ 'డిప్యూటి' అని మీడియాకు లీకులొదిలారు. మంత్రుల ప్రమాణస్వీకారం సమయంలో 'డిప్యూటి' మాట ఎత్తలేదు. అదేంటంటే రాజ్యాంగంలో డిప్యూటి అనే పదం ఎక్కడా లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. డిప్యూటి సిఎం ప్రత్యేకంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన అవసరం లేదన్నారు.
Friday, December 3, 2010
జగన్ సక్సెస్ అవుతారా?
ఆన్సర్ మై క్వచ్చన్.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ తనయుడు జగన్ కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా కనబడుతోంది. పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల్లోపు పార్టీ పెడతారని, త్వరలో ప్రకటన ఉంటుందని జగన్ మౌత్‌పీస్ అంబటి రాంబాబు పేర్కొన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడిన మరుక్షణం నుండి ఆయన పెట్టబోయే పార్టీపై ఊహాగానాలోస్తున్నాయి. 'వైఎస్‌ఆర్ కాంగ్రెస్' పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తి ఆ పేరును జగన్‌కు అంకితమిస్తానంటున్నారు. జగన్ కొత్త పార్టీ పేరేంటి, అది ఎలా ఉండబోతోందన్న విషయాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పేరు దాదాపు ఖరారైందంటున్నారు. 'వైఎస్‌ఆర్ కాంగ్రెస్'లో వైఎస్‌ఆర్ అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి అనుకోవచ్చు లేదా 'యువజన శ్రామిక రైతు' అయినా అనుకోవచ్చు. రెండు అర్థాలొచ్చేటట్లు పేరు పెట్టారంటున్నారు.
Monday, November 29, 2010
ప్చ్... చిరంజీవి!
కాంగ్రెస్ కౌగిల్లోకి ప్రజారాజ్యం చేరుతుందా? ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ ఎందుకు అక్కున చేర్చుకుంటోంది? ఈ ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మంత్రివర్గంలో పిఆర్‌పి చేరికపై ఊహాగానాలు జోరందుకున్నాయి. పిఆర్‌పి ఏర్పాటే అనుమానాస్పదం. కాంగ్రెస్‌కు, టిడిపికి ప్రత్యామ్నాయని, సామాజిక న్యాయమని తిరుపతిలో పార్టీ ఏర్పాటు సభలో ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ పలుకులకు దూరం జరిగారు. ఎన్టీఆర్ వలే పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అవుదామనుకుంటే స్వయంగా చిరంజీవే ఒక నియోజకవర్గంలో ఓడిపోవడం విధి విచిత్రం. పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు పిఆర్‌పి పరిమితమైనప్పటికీ ఆ పార్టీకి 18 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల చీలిక మూలంగానే టిడిపికి అధికారం దక్కకపోగా చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకుంది. ఎన్నికల తర్వాత జెండా పీకేస్తారని, చిరంజీవి సినిమాల్లో నటిస్తారని వార్తలొచ్చాయి.
Sunday, November 28, 2010
'చిదంబర' రహస్యం!
రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కిరణ్‌కుమార్‌రెడ్డిని కూర్చోబెట్టడానికి కేంద్ర హౌం మంత్రి చిదంబరం తన వంతు సాయం చేశారా? ఈ ప్రశ్న కాంగ్రెస్ వర్గాలను తొలిచేస్తోంది. కిరణ్ సిఎం కావడానికి ఏ శక్తులు ఢిల్లీలో పని చేశాయో పరిశోధిస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు 'చిదంబర' రహస్యం బయటికొచ్చిందట. కిరణ్‌కుమార్ తండ్రి నల్లారి అమరనాథ్‌రెడ్డి, 'తమిళతంబి' మాంచి ఫ్రెండ్స్. తమిళనాడుకు అతి సమీపంలో నల్లారి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉంది. అమరనాథ్‌రెడ్డికి చిదంబరానికి దగ్గరి సాన్నిహిత్యం ఉండేదట. చిదంబరం కొన్నాళ్లపాటు కాంగ్రెస్‌ను వీడి మొపనార్ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ నల్లారి వారి కుటుంబానికి, ఆయనకు సంబంధాలు కొనసాగాయట. కేంద్రంలో కాంగ్రేసేతర ప్రభుత్వంలో పని చేసినప్పుడు కూడా చిదంబరానికీ, నల్లారి ఫ్యామిలీకి సాన్నిహిత్యం కొనసాగిందట.
Saturday, November 27, 2010
గ్రీటింగ్×పరామర్శ
గ్రీటింగ్, పరామర్శ ఈ రెంటిలో ఏది ముందు? రాష్ట్ర కాంగ్రెస్ నేతల ముందున్న పజిల్ ఇది. గ్రూపు తగాదాల్లో తలమునకలైన కాంగ్రెస్ వారికి హఠాత్తుగా ఈ ధర్మసందేహం ఎందుకొచ్చిందంటారా? మొన్న కొన్ని గంటలపాటు నూతన ముఖ్యమంత్రి ఎవరవుతారోనని బీపీలు పెంచుకున్న పార్టీ నేతలకు ఆ కాస్తా తెలిశాక మంత్రి పదవులపై తెగ ఆందోళన పడుతున్నారు. నూట పాతికేళ్ల కాంగ్రెస్‌లో ఎలాగూ ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువ కనుక మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల పైరవీలు, లాబీయింగ్ సరేసరి. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజున అధికారులతో కిరణ్‌కుమార్‌రెడ్డి లాబీయింగ్ కాదు సమర్ధతే గీటురాయి అని చెప్పుకొచ్చారు. ఆ సమావేశానికి హాజరైన అధికారులు వాళ్లలో వారు ఢిల్లీలో లాబీయింగ్ చేయడంవల్లనే ఈయనగారు సిఎం అయ్యారట కదా అని గుసగుసలాడుకున్నారట. కుర్చీ ఎక్కిన తర్వాత ముచ్చటగా మూడో రోజున కిరణ్ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నట్లు? అని గొణుకున్నారు.
Thursday, November 25, 2010
కిరణ్ మిలీనియం జోక్
మూడు కుంభకోణాలు, ఆరు అక్రమాలతో వర్ధిల్లుతున్న యుపిఎ ప్రభుత్వం 2జి స్పెక్ట్రం స్కాంతో ఎటూ పాల్పోక ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. '2జి'పై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి) విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ ఉత్పాతం నుండి ఎలా బయటపడాలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను మరింత కుంగదీశాయి. బీహార్‌లో సోనియా,రాహుల్ ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్‌కు ఐదారు సీట్లే వచ్చాయి. సోనియా, రాహుల్ లోక్‌సభ స్థానాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రం. రోజురోజుకూ కాంగ్రెస్ అడుగు జారుతుండగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలకు 41 గెలుచుకుంటామంటున్నారు కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఎందుకనో ఒక్క సీటు వదిలిపెట్టారు. అంతేకాదు 41 ఎంపీలను గెలిపించి రాహుల్‌ను ప్రధానిని చేస్తారట. ఈ కోరిక తనది కాదట. వైఎస్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు 41 లోక్‌సభ సీట్లు సాధించి రాహుల్‌ను ప్రధానిని చేస్తామన్నారట. వైఎస్ ఆఖరి ఆశను కిరణ్‌కుమార్ నెరవేరుస్తారట.
తెర వెనుక కథేంటి?
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణాలో ఆందోళనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎలా సిఎంను చేస్తారన్న వాదనలన్నీ పటాపంచలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం సిఎం పదవికి ఎంపిక చేసింది. గురువారం ఆయన రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేస్తారు. కిరణ్‌కుమార్ గతంలో వైఎస్‌కు సన్నిహితంగా మెలిగినప్పటికీ, చీఫ్‌విప్‌గా, స్పీకర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ వైఎస్ చనిపోయాక జగన్‌కు వ్యతిరేకంగా మారినట్లు చెబుతున్నారు. జగన్‌కు చెక్ పెట్టడానికి రాయలసీమకు చెందిన కిరణ్‌కుమార్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించినట్లుంది.
Tuesday, November 23, 2010
గొంగట్లో అన్నం తింటూ...?!
మొక్కప్పుడు తుంచేయకపోతే మాను అవుతుందన్న సామెత ఇప్పటి మీడియా పోకడకు సరిగ్గా అతుకుతుంది. మనం చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పు అంటోంది ఇప్పటి మీడియా. మీడియా అంటే కేవలం టీవి చానెల్స్ మాత్రమే కాదు. ప్రధాన పత్రికలకూ ఈ విమర్శ వర్తిస్తుంది. పక్కనున్న తమిళనాడులో మీడియా, రాజకీయ పార్టీలకు మధ్య సరళరేఖ చెరిగి పోయిందని అనుకున్నాం. అక్కడ పార్టీలే పత్రికలు, మీడియాను నడుపుతున్నాయని వింత ప్రదర్శించాం.
Monday, November 22, 2010
మైక్రోల కోసమే ఆ బిల్లు?
Sunday, November 21, 2010
వెర్రి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అనగానే ముందు చార్మినార్ తర్వాత హుస్సేన్‌సాగర్ మదిలో మెదులుతాయి. ట్యాంక్‌బండ్ సైతం స్మరణకొచ్చినప్పటికీ ప్రాంతీయ ఆందోళనల పుణ్యమా అని వివాదస్పదమైంది. ఇప్పుడు ట్యాంక్‌బండ్ మాటెత్తకపోవడం ఉత్తమం. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడు ఇంకా ప్రాంతీయ గొడవల్లోకి రాలేదు కనుక తథాగతుని విగ్రహాన్ని తలుచుకుంటే ఇబ్బందేమీలేదు. శాంతిని బోధిస్తున్న బుద్ధుని సాక్షిగా విధ్వంసాలు, ప్రజా ఉద్యమాలపై పోలీస్ లాఠీఛార్జీలు, తూటాల వర్షాలు సరేసరి. వినాయకచవితికి హుస్సేన్‌సాగర్‌కు అవినాబావ సంబంధముందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Saturday, November 20, 2010
సిగ్గుచేటు
చాయ్ ..చాయ్ ... నేను బస్టాప్‌లో నించొని ఉండగా చిన్న పిలగాడు చాయ్ అమ్ముతున్నాడు. నా దగ్గరకొచ్చి సార్ చాయ్ అన్నాడు. నాకు చాయ్ వద్దుకాని నీకు పట్టుమని పదేళ్లు లేవు చాయ్ అమ్ముతున్నావ్, బడికెందుకెళ్లట్లేదు, చదువుకోవా అని నేను ఆ పిల్లాడిని ప్రశ్నించాను. మొన్నీమధ్య మా నాన్న చచ్చిపోయాడు. నేనే సంపాదించాలి, మా అమ్మ పని చేయలేదు అని దీనంగా చెప్పాడు. పేపర్ చదువుతున్న నా పక్కాయన ఒక్కసారి పేపరు పక్కకు జరిపి మా మధ్య జోక్యం చేసుకొని 'వీడు అబద్ధం చెబుతున్నాడు. ఇంట్లో చెప్పకుండా సిటీకొచ్చి ఉంటాడు. చేతిలో డబ్బులైపోయేసరికి ఈ వేషం వేశాడు' అని అన్నాడు. ఇదిగో చూశారా పేపర్లో వేశారు.
Thursday, November 18, 2010
చీమాయణం
చీమ..
ఆకారంలో చిన్నదని మనకు చులకన. కాని చీమకూ చాంతాడంత చరిత్ర ఉందండోయ్. లాంగ్ లాంగ్ ఎగో చీమ శంకరుడి కటాక్షం కోసం తపస్సు చేసింది. భక్తా ఏమి నీ కోరిక అని శంకరుడు చీమ ముందు ప్రత్యక్షమయ్యాడు. నేను కుట్టగానే చనిపోవాలని వరం కోరుకుంది చీమ. తథాస్తు అన్నాడు శంకరుడు. ఆ నాటి నుండి చీమ కుట్టడం మనిషి దాన్ని నలిపి చంపడం జరుగుతున్న చరిత్ర. ఇదో పుక్కిటి పురాణం. కాని దీనిలోనూ నీతి ఉంది. తన చేత కుట్టించుకున్నవారెవరైనా చావాలని చీమ వరం కోరుకోవాలనుకుంది. భాష, భావ వ్యక్తీకరణలో పొరపాటు చేసి తన నెత్తిమీదికే తెచ్చుకుంది. ఏదైనా విషయాన్ని ఎదుటివారికి సూటిగా అర్థమయ్యేటట్లు వ్యక్తీకరింకపోతే ఎదురయ్యే అనర్థాలను చీమ 'పురాణం' బోధిస్తోంది.
Wednesday, November 17, 2010
' సూక్ష్మ' టెండర్
- వెయ్యి కోట్ల బెయిలవుట్
- బ్యాంకులకు బీసీలు మేమే
- మల్టిపుల్ క్రెడిట్ బ్యూరో అవతారం
- బ్రాంచ్‌లెస్ బ్యాంకింగ్ ఎజెండా
- రాష్ట్రంలో పెరిగిన రుణాలు
మైక్రో ఫైనాన్స్ ఇండియా-2010 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికపై నుంచి సూకë సంస్థలు బీద అరుపులు అరిచాయి. మహిళల ఉసురు పోసుకుంటూ, ఆత్మహత్యలకు కారణమవుతున్న మైక్రోలు తమకు కేంద్రం వెయ్యి కోట్ల బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. బ్యాంకులు తమను బిజినెస్ కరస్పాండెంట్లు (బిసి)గా పెట్టుకోవా లని కోరాయి. తాము రుణాలకే పరిమితం కాకుండా అన్ని పనులకూ పనికొచ్చేలా మల్టిపుల్ క్రెడిట్ బ్యూరోలుగా మార్పు చెందాలని నిర్ణయించాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వల్ల తామెంతగానో నష్టపోయినట్లు మైక్రోలు వాపోతుండగా, ఆ ప్రచారంలో నిజం లేదని ఢిల్లీలో సోమవారం ప్రారంభమైన సదస్సులో విడుదల చేసిన నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది మార్చి నాటికి మైక్రోలు 12 వేల కోట్ల రూపాయలు రుణాలివ్వగా, ఈ ఏడాది మార్చి నాటికి 18 వేల కోట్లకుపైగా రుణాలు పంపిణీ చేశాయి. గత సంవత్సరం కంటే ఆరు వేల కోట్లు అదనంగా రుణాలిచ్చాయి. సదస్సును ఏర్పాటు చేసిన 'యాక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీస్' రూపొందించిన 2010-స్టేట్ సెక్టార్ రిపోర్టులో ఈ వివరాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మైక్రోలకు క్లయింట్లు భారీగా పెరిగారు.
Tuesday, November 16, 2010
'సూక్ష్మ' హామీలు చెల్లని చెక్కులు
- మైక్రో బకాయిలపై లెక్కల్లేవు
- రుణాలపై చేతులెత్తేసిన బ్యాంకులు
- పావలావడ్డీ ప్రకటించని ప్రభుత్వం
మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాల నుండి ప్రజలను రక్షించడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్, ఆ సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు చెల్లని చెక్కుల వలే పనికిరాకుండా పోయాయి. రోజుకో విధంగా సమస్యలు ముసురుకుంటున్నాయి. ఆర్డినెన్స్ చెల్లదంటూ ఇప్పటికే మైక్రో సంస్థలు హైకోర్టులో సవాల్ చేయగా, 'సూక్ష్మ' బకాయిలు తీర్చేందుకు బాధితులకు రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు చేతులెత్తేశాయి. ఉన్న ఫళంగా మూడు నెలల్లో పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం సాధ్యం కాదంటున్నాయి. మైక్రో బకాయిలు తీర్చడానికి బ్యాంకులిచ్చే రుణాలపై పావలావడ్డీ అమలుకు ప్రభు త్వం ముందుకు రాలేదు. సూక్ష్మ సంస్థలు రాష్ట్రంలో ఎన్ని రుణాలిచ్చాయో వాస్తవ లెక్కలు తేలట్లేదు.
ప్రభుత్వ వైఫల్యంతో 'సూక్ష్మ' గృహ రుణాలు
- వడ్డీ 18-30 శాతం
- ఇందిరమ్మ లబ్ధిదారులకు వల
- ఆగిన ఇళ్లకు ప్రత్యేక లోన్లు
గృహోపకరణాలు, చిన్న వ్యాపారాలు, రోజువారీ ఖర్చులకు రుణాలిచ్చి మహిళలను పీల్చి పిప్పిచేస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై పంజా విసరడానికి సిద్ధమ య్యాయి. ప్రత్యేకంగా గృహ నిర్మాణాలకు సూక్ష్మ రుణాలివ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. 'సూక్ష్మ గృహ రుణం' రంగంలోకి మైక్రోలు అడుగు పెట్టడానికి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించాయి. శాచురేషన్ ప్రాతిపదికన గ్రామాలు, పట్టణాల్లోని పేదలందరికీ పక్కా ఇళ్లంటూ ప్రభుత్వం నాలుగైదేళ్లుగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం ఆచరణలో ఘోరంగా విఫలమైంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉన్న గుడిసెలను కూల్చి పక్కాఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన లబ్ధిదారులకు నిధులివ్వ కుండా ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. ఇచ్చిన నిధుల్లో సైతం భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయి. లక్షల్లో చేపట్టిన ఇళ్లు మధ్య లోనే నిలిచిపోయాయి. నిధుల కోసం ఎదురు చూస్తున్న ఇందిరమ్మ లబ్ధిదారుల అవసరాలను మైక్రో సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. సూక్ష్మ సంస్థల ఆగడాలను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఇందిరమ్మ లబ్ధిదారులూ ఉన్నారు.
'మైక్రో'లే బ్యాంక్ ఏజెంట్లు
- అకౌంట్లు, డిపాజిట్ల సేకరణ '
- రుణం' తీర్చుకొంటున్న బ్యాంకులు
- పేదలు నిలువు దోపిడీ
కొన్ని జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఏజెంట్లుగా మారాయి. కుగ్రామాల నుండి కొత్త అకౌంట్లను, డిపాజిట్లను సేకరించి భారీగా కమీషన్లు పొందుతున్నాయి. దానికి ప్రతిఫలంగా బ్యాంకులు మైక్రోలకు భారీగా రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. మైక్రోలు పేదలకు అప్పులిచ్చి నిలువునా దోపిడీ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరినీ బ్యాంకుల పరిధిలోకి తీసుకొచ్చి అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఇవ్వాలని కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్ రెండు మూడేళ్ల నుండి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రతి గ్రామానికీ బ్యాంకులు సర్వీస్ ఇవ్వలేవంటూ ఆర్‌బిఐ వ్యాపార నిబంధనలను సరళీకరించింది. ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ వ్యవస్థ పేరిట దీన్ని ముందుకు తెచ్చింది. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలను బ్యాంకులు తమ ప్రతినిధులుగా ఏర్పాటు చేసుకోడానికి అనుమతించింది. వీరిని బిజినెస్ కరెస్పాండెంట్లు, వెండర్లుగా చెబుతున్నారు. బ్యాంకులకు, ఖాతాదార్లకు మధ్య వీరు అనుసంధానకర్తలుగా ఉంటారు.
'మైక్రో'కు నాబార్డు అండ
- రీఫైనాన్స్‌పై వడ్డీ తగ్గింపు
- విరివిగా బ్యాంకు రుణాలు
- సూకë సంస్థలకు 9 శాతం.. డ్వాక్రా గ్రూపులకు 12 %
చిన్న అవసరానికి అప్పు తీసుకున్న పేదలను జీవితాంతం రుణ గ్రస్తులుగా మారుస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) అండగా నిలిచింది. సూక్ష్మ సంస్థలను ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం మూలంగానే నాబార్డు మైక్రోలకు 'సాయం' చేసింది. ప్రభుత్వ రంగంలోని జాతీయ బ్యాంకులకు రీఫైనాన్స్ పద్ధతిపై నాబార్డు ఇచ్చే రుణాల్లో అత్యధిక శాతం మైక్రోలకు అందే విధంగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. వ్యవసాయం, స్వయం సహాయ సంఘా (ఎస్‌హెచ్‌జి)లకు ఇచ్చే రుణాలపై కంటే మైక్రోలకు ఇచ్చే రుణాలపై వడ్డీని మూడు శాతం తగ్గించింది. ఈ మేరకు గత ఏడాదే నాబార్డు నిర్ణయం తీసుకుంది. మైక్రోలకు అప్పులివ్వడానికి నాబార్డు తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ చేస్తుండటంతో జాతీయ బ్యాంకులు కూడా ఇతర రుణాలపై కంటే తక్కువ వడ్డీకి మైక్రోలకు విరివిగా రుణాలిస్తున్నాయి. భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) సైతం మైక్రోలకు తక్కువ వడ్డీకి రుణాలిస్తుండటంతో జాతీయ బ్యాంకులతో పాటు ప్రైవేట్, విదేశీ బ్యాంకులు కూడా సూక్ష్మ సంస్థలకు తక్కువ వడ్డీపై పెద్ద మొత్తంలో అప్పులిస్తున్నాయి. బ్యాంకుల నుండి తక్కువ వడ్డీపై రుణాలు తీసుకుంటున్న మైక్రోలు అడ్డూ అదుపూ లేకుండా మహిళా గ్రూపులకు, ఇతర వర్గాలకు సూక్ష్మ రుణాలిచ్చి తమకిష్టమొచ్చినట్లు అధిక వడ్డీలు గుంజుతున్నాయి. అప్పులను, వాటిపై వడ్డీలను తిరిగి చెల్లించలేని పేదలను చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి.
Monday, November 15, 2010
మై'క్రోర'లు
ఎస్‌హెచ్‌జిలకు వల
రాష్ట్రంలో మారుమూలకు విస్తరణ
టాప్‌టెన్‌లో ఐదు ఇక్కడే
రైతుపైనా కన్ను
మనీ లెండింగ్ బిల్లులో 'సూక్ష్మ' నియంత్రణకు సర్కార్ నో
ఒత్తిళ్లే కారణం
బ్యాంకర్ల ఫిర్యాదును పట్టించుకోని ఆర్‌బిఐ
రాష్ట్రంలో మారుమూలకు విస్తరణ
టాప్‌టెన్‌లో ఐదు ఇక్కడే
రైతుపైనా కన్ను
మనీ లెండింగ్ బిల్లులో 'సూక్ష్మ' నియంత్రణకు సర్కార్ నో
ఒత్తిళ్లే కారణం
బ్యాంకర్ల ఫిర్యాదును పట్టించుకోని ఆర్‌బిఐ
రాష్ట్రంపై మైక్రో ఫైనాన్స్ మహమ్మారి ఇంతగా కోరలు చాచడానికి ఇక్కడ అత్యధిక సంఖ్యలో స్వయం సహాయ గ్రూపుల (ఎస్‌హెచ్‌జి) ఏర్పాటు ప్రధాన కారణమా?! మైక్రో విష కోరల్లో 40 లక్షల మంది చిక్కుకొని గిలగిల్లాడటానికి వెనుక ప్రభుత్వ వైఫల్యం లేదా? అసలు, అధిక వడ్డీ చెల్లించలేక, మైక్రో వేధింపులకు తాళలేక పలువురు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడంపై సర్కార్ బాధ్యత తీసుకోదా? మైక్రో దా'రుణాలు' ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు బ్యాంకు లింకేజి ద్వారా సూక్ష్మ రుణాలిచ్చేందుకు దేశం మొత్తమ్మీద ఏర్పాటైన ఎస్‌హెచ్‌జిల్లో సగానికంటే ఎక్కువ రాష్ట్రంలోనే ఉన్నాయి. వీటిపై మైక్రో ఫైనాన్స్ సంస్థలు కన్నేశాయి. బ్యాంక్ లింకేజి రుణాల కోసం ఎదురు చూస్తున్న మహిళలను మైక్రోలు వలలో వేసుకుంటున్నాయి. ఎస్‌హెచ్‌జిలకు బ్యాంకుల నుండి రుణాలిప్పించలేని ప్రభుత్వ వైఫల్యాన్ని మైక్రోలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఎస్‌హెచ్‌జిల ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం మైక్రోలు వేసే ఎరలకు ఆశపడి గ్రూపులను అప్పచెపుతున్నారు. వారే ఏజెంట్ల అవతారమెత్తుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూపుల్లో చీలికలు తీసుకొచ్చి మైక్రోలు లాభ పడుతున్నాయి. రాష్ట్రంలో మైక్రో దోపిడీ పెరగడంతో నిఘా వర్గాలు రెండేళ్ల క్రితమే ఈ విషయాలను సర్కార్ దృష్టికి తీసుకొచ్చాయి.
సూక్ష్మ రాక్షసం చతుష్టయం పనే
అత్యధిక వడ్డీలతో ప్రజల రక్తాన్ని పీలుస్తూ, గ్రామాల్లో చెలరేగిపోతూ, పేదల ఆత్మహత్యలకు కారణమవుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వ్‌బ్యాంక్ (ఆర్‌బిఐ) ఏమీ చేయలేకపోవడానికి కారణమేంటి? ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సైతం ధిక్కరించే ధైర్యం సూక్ష్మ సంస్థలకు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు జవాబులు సామాన్యుల మెదళ్లకు తట్టలేక పోవచ్చు. ప్రపంచబ్యాంక్, కేంద్రం, ఆర్‌బిఐ, మైక్రో ఫైనాన్స్ సంస్థలు దుష్టచతుష్టయంగా ఏర్పడినందువల్లనే మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం 'సూక్ష్మ' పోటు తప్పట్లేదన్నది సత్యం. ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ వ్యవస్థ ప్రపంచబ్యాంక్ అమ్ములపొదిలో నుండి వచ్చిందన్న సంగతి తెలిసిందే.
సంక్షోభంపై 'మైక్రో' గగ్గోలు
- రంగంలోకి విదేశీ మీడియా
-దా'రుణా'లకు మసిపూత
- బ్యాంక్ అప్పులకు వల
-15న ఢిల్లీలో సమ్మిట్
-ఆర్డినెన్స్‌పై చర్చకు సెర్ప్ సిఇఓకు ఆహ్వానం
-దా'రుణా'లకు మసిపూత
- బ్యాంక్ అప్పులకు వల
-15న ఢిల్లీలో సమ్మిట్
-ఆర్డినెన్స్‌పై చర్చకు సెర్ప్ సిఇఓకు ఆహ్వానం
రాష్ట్ర ప్రభుత్వం కోరల్లేని ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి సూక్ష్మ రుణ బాధితులను మభ్య పెట్టగా, ఈ ఆర్డినెన్స్ వల్లనే బ్రహ్మాండం బద్దలైనట్లు, నష్టాల్లో నిలువునా మునిగినట్లు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఒక పథకం ప్రకారం గగ్గోలు పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్‌తో దేశం మొత్తమ్మీద మైక్రో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నట్లు చిత్రించి విపరీతమైన సానుభూతిని పొందడానికి కుట్ర చేస్తున్నాయి. బిబిసి, వాషింగ్టన్‌పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్ సహా అంతర్జాతీయ, కార్పొరేట్ మైక్రోలు మీడియాలో తమకు అపార నష్టం జరిగిందని ప్రచారం చేయిస్తున్నాయి. విదేశీ జర్నలిస్టులను రాష్ట్రంలో దింపి అధ్యయనాలు చేయించి తమకనుకూలంగా కథనాలను వండి వారుస్తున్నాయి. మైక్రో సంస్థల దా'రుణా'లతో ఆత్మహత్యలు చేసుకున్న జిల్లాల్లో విదేశీ మీడియా జర్నలిస్టులు పర్యటిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)