Friday, March 25, 2011

దొంగల ముఠాకు రాణి సోనియాగాంధీ కాదంటారా?

శ్రీకృష్ణ కమిటీ దొంగల ముఠా అని, దాని నాయకుడు ఎవరో తేలాల్సి ఉందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీ ఆవరణలో విమర్శలు చేశారు. ఈ విమర్శ టిఆర్‌ఎస్‌ చేస్తే పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు. మరేదేని ప్రతిపక్షాలు చేసినా కొట్టిపారేయవచ్చు. అయితే ఉద్యమపార్టీగా చెపుతున్న టిఆర్‌ఎస్‌ కూడా శ్రీకృష్ణ కమిటీపై రెండు విధాలుగా స్పందించింది. తొలుత శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటును వ్యతిరేకించింది. దానికి నిర్ధారించిన విధి, విధానాలొచ్చాక టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అంతలోనే శ్రీకృష్ణ కమిటీకి టిఆర్‌ఎస్‌ నివేదిక ఇచ్చింది. 2010 జనవరిలో చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ సైతం సంతకం చేసిన విషయాన్ని మరవరాదు. 2004లో కాంగ్రెస్‌కు, టిఆర్‌ఎస్‌కు ఎన్నికల పొత్తు కుదిరినప్పుడు రెండో ఎస్సార్సీకి టిఆర్‌ఎస్‌ నేతలు ఒప్పుకుంటూ సంతకం పెట్టారు. యుపిఎ తన మేనిఫెస్టోలో పరస్పర చర్చలు, ఏకాభిప్రాయం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఇస్తామంది. అంతేకాకుండా అసెంబ్లీలో మెజార్టీ తెలంగాణా రాష్ట్రాన్ని బలపరుస్తూ తీర్మానం ఆమోదిస్తేనే పార్లమెంట్‌లో బిల్లు పెడతామని, సోనియాగాంధీ నాయకత్వం వచ్చాక పార్టీ అవలంబిస్తున్న విధానం ఇదేనని స్పష్టం చేసింది.

ఇంత పెద్ద చర్చలో కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ కీలక భూమిక పోషించాయి. తెలంగాణ రాష్ట్రం కోసమే ఏర్పాటయిన టిఆర్‌ఎస్‌ ఎలాగు ప్రతిపక్ష పార్టీ కనుక ప్రభుత్వ నిర్ణయాలను తన వ్యూహానికి అనుగుణంగా మార్చుకొనే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ సంగతే విచిత్రం. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఒకే నిర్ణయం తీసుకోవడంలేదు. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల కాంగ్రెస్‌ నేతలు ఒకే విధానం కలిగి లేరు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పొగుడుతూనే అది సూచించిన ఆరవ సూత్రానికి కట్టుబడి నిర్ణయం చేయాలంటూ కేంద్రాన్ని, కాంగ్రెస్‌ను కోరుతున్నారు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు. టి-కాంగ్రెస్‌ నేతలు శ్రీకృష్ణ కమిటీని తిట్టిపోస్తున్నారు. ఎనిమదో చాప్టర్‌ను బహిర్గతం చేయాలని హైకోర్టు తీర్పు చెప్పాక తాము ప్రతిపక్షాల కంటే ఎక్కడ వెనుకపడి పోతామోనని వారూ శ్రీకృష్ణ కమిటీని తూలనాడుతున్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటామన్న నేతలు ఇప్పుడు ఎందుకు మాట మార్చారన్నదే ప్రశ్న. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఒక వేళ బెస్ట్‌ ఆఫ్షన్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఉంటే సీమాంధ్రలోని కాంగ్రెస్‌ నాయకులు కూడా శ్రీకృష్ణ కమిటీని తిట్టిపోసేవారనడంలో సందేహం లేదు. ఓట్లు, సీట్లు, రాజకీయ లబ్ది, వ్యక్తిగత ప్రయోజనాలు మినహా ఇచ్చిన మాటపై కట్టుబడటం, ఒక విధానంపై చివరి వరకూ నిలబడటం కాంగ్రెస్‌ నేతలకు అలవాటు లేని పని.

శ్రీకృష్ణ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? కేంద్ర ప్రభుత్వం... అందులోని కీలకమైన హౌం మంత్రిత్వశాఖ. కేంద్రంలో అధికారంలో ఉన్నదెవరు? కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ. యుపిఎ ఛైర్‌పర్సన్‌ ఎవరు? సోనియాగాంధీ. కాంగ్రెస్‌ నేతలందరూ తమ నేత సోనియాగాంధీయేనని ఢంకా భజాయించి చెబుతున్నారు. సోనియాకు తెలీకుండా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదు. ఇక తెలంగాణా అంశంపై రెండుసార్లు ప్రకటన చేసింది, పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది, శ్రీకృష్ణ కమిటీని వేసింది హౌం మంత్రి చిదంబరం. ఆయన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సభ్యుడు.

శ్రీకృష్ణ కమిటీ దొంగల ముఠా అని, దానికి నాయకులెవరో తేలాలని టి-కాంగ్రెస్‌ నేతలంటున్నారంటే ఏం అర్ధం చేసుకోవాలి? శ్రీకృష్ణ కమిటీని వేయడానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ప్రకటన చేసిన చిదంబరం, కోర్‌కమిటీలోని ప్రణబ్‌ ముఖర్జీ, ఆంటోని, అహ్మద్‌పటేల్‌ తదితర సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్లు శ్రీకృష్ణ కమిటీ అనబడే దొంగల ముఠాకు నాయకత్వం వహించి ఉండాలి. తమ నాయకులే దొంగల ముఠాకు నాయకులని టి-కాంగ్రెస్‌ నేతలకు తెలీదంటారా?

22 comments:

  1. meerannadi aksharaala nijame.. kani.. sonianu ani em labham ledu.. ee motham muthaku nayakudu aksharala ks rao matrame. lagada patini mundunchi tanu venuka undi sonia to saha andarini prerepistunnadu.. 1961 lo indira gandhine manage chesina ks rao ku sonia, patel, pranab lu lekka kadu.. congress lo suitcase rajakeeyanni modalu pettinde ks rao. atanni oppinchakunda.. raaji cheyakunda telangana vache samasye ledu

    ReplyDelete
  2. we dont know whether there is a queen or not but we know very well that the king is chandrababu naidu and there are many princes like lagadapati.

    ReplyDelete
  3. Yes she is the bandit queen and TRS leaders are their partners in splitting TDP in a cheap political way, by flaring-up regional feeling among ignorant people.
    KCR is waiting to prolong for better bargain for himself and his useless daughter and son.


    Please disable 'word verification'.

    ReplyDelete
  4. i think if any one wants to know the meaning of ignorance,we can askthem to see the comment of'snkr'posted above.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. మీ వాదనలు అపరిపక్వంగా ఉన్నాయి .ప్రజలకు విషయాలు భాగానే అర్థం అవుతాయి .దొంగ ఎవరో ,దొర ఎవరో సామాన్యులకు స్పష్టంగా తెలుసు .కాకపోతే వ్యవస్తను మార్చుకొనే చైతన్యానికి కొంత సమయం పట్ట వచ్చు .ఇదే అదను అని ఎవరి పార్టీ అజెండాలను ఆ పార్టీ పత్రికలూ pracharam చేయటం చాల అసహ్యాన్ని ఎవగిమ్పుని కలిగిస్తాంది.శ్రీ కృష్ణ 8 వ చాప్టర్ లో చెప్పినటు మీరంతా managed మీడియా అని బలంగా అనిపిస్తుంది .

    ReplyDelete
  7. "శ్రీకృష్ణ కమిటీ దొంగల ముఠా అని, దానికి నాయకులెవరో తేలాలని టి-కాంగ్రెస్‌ నేతలంటున్నారంటే ఏం అర్ధం చేసుకోవాలి"
    --------
    రాణీ సోనియా గాంధీ నే, కాకపోతే ఆమెకు చెంచా క.చ.రా. దొర అంతే :)
    @ కోవెల గారు, కావురిని అంటున్నారు, కావురి కి అంత సీను ఉంటే, అంత కంటే గుడెసెల వెంకటసామి కి ఉండి ఉండాలి కదా? 1961 లో ఇందిరను మేనేజి చేసాడా కావూరి? ఎవరు చెప్పారు? మీ దొర ఏమయినా చెప్పిండా? కావూరికి మొదటినుండి అర్జున్ సింగు(మాత్రమే) రాజకీయాలలో అండ. అంతకంటే ఏమీ లేదు. తను కంగీ కి కంటే అర్జున్ సింగు కే ఎక్కువ విధేయుడుగా ఉంటూ వచ్చాడు, తనకు సోనియాను మేనేజి చేసే అంత సీనా? తెలబానులకు తమ మీద తమకు నమ్మకం లేకపోగా, అవతలి వాళ్ల సామర్ధ్యం మీద విపరీతమయిన నమ్మకం అని మీ కామెంట్ మరో సారి నిరూపిస్తుంది :) ఇక కావూరి ని రాజి చేయాలా? ఎందుకు? తనకు ఉన్న ఆస్తులు హైదరాబాద్ చుట్టుపక్కల కంటే ఎక్కువ ఆస్తులు ఎంతమంది రాజకీయనాయకులకు/ వ్యాపారవేత్తలకు లేవు? అందర్నీ రాజీ చేస్తారా? ఆ రాజీ కోసమేనే నిస్వార్ధం గా మీ దొర ఆయన కుటుంబం మామూళ్ళు వసూళ్లు చేస్తుంటే, దొర తెలబాన్ శిష్యులు విగ్రహాలను పగలగొడుతూ సప్పోర్ట్ చేస్తుంది? తనకు తాను ఒక్కసారి కూడా మినిస్టర్ పోస్ట్ తెప్పించుకోలేని వాడికి అంత సీను ఇవ్వటం మీకే చెల్లింది.

    @ udaya, ignorance అంటున్నారు కాబట్టి,
    క.చ.రా. తెలంగాణా దేవత అని ఎందుకన్నాడో చెబుతారా? మొన్నటికి మొన్న కాంగీని బలపరుద్దాం అని ఎందుకన్నాడో చెబుతారా? అంత దాకా ఎందుకు పోయిన సంవత్సరం చిదంబరం అఖిల పక్ష మీటింగ్ తర్వాత ఊహ్యాత్మక మౌనం, అలాగే శ్రీక్రిష్ణ రిపోర్ట్ వచ్చినాక దాదాపు ఓ నెల రోజులు మౌనం ఎందుకు పాటించాడో చెబుతారా?
    ఇదంతా క.చ.రా దొరను ముందు బెట్టి, ముఠా రాణి ఆడుతున్న నాటకం అని మీకనిపించటం లేదా?
    ఇప్పుడు చెప్పండి ignorant ఎవరో, అప్పటికీ అర్ధం కాకపోతే, ఓ సారి అద్దం లో మొఖం చూసుకోండి, మీకు నికార్సయిన ignorant ఎవరో కనిపిస్తారు :)
    ఇంకోమాట, "దొంగ ఎవరో ,దొర ఎవరో సామాన్యులకు స్పష్టంగా తెలుసు" అంటున్నారు, అది తెలిసేనా, క.చ.రా. దొరకు, దొర సంతానానికి కాల్మొక్కుతూ బతుకుతున్నారు? లేదు సామాన్యులకు తెలుసు, దొర ఎవరో, దొంగ ఎవరో తెలబానులకు మాత్రమె తెలియదు అంటారా, ఒప్పుకొంటాను మీ మాటతో!!

    ఇక చంద్రబాబు కింగ్ అంటున్నారు, చంద్రబాబుకు అంత సీను ఉందా ప్రస్తుతానికి? శ్రీక్రిష్ణ కమిటీ ని తను వేయించాడా? దాని రిపొర్ట్ తను ఏమయినా మార్చాడా? రెండు ప్రాంతాలలో తనకు బలం ఉన్నది కాబట్టి, కాంగీ వెసే ఎత్తులకు ఎదురు ఎత్తులు (బలహీనం) గా వేయటం లోనే తనకు సమయం సరిపోతుంటే, ఏకంగా ఆయన్ను కింగ్ ను చేసి, లగడపాటి ని prince అంటున్నారు, అలా అయితే దొర, వెంకటసామి ఆయన సంతానం, గుతా , యాష్కీలు ఎవరు? వాళ్లు prince లు కారా? లేక తెలంగాణా కు చెందిన ప్రతి రాజకీయనాయకుడు, డబ్బు ఉన్నాకూడా useless fellows అంటారా? అలాగయితే మీతో నాది ఎకాభిప్రాయమే సుమా :)
    చివరగా, మైలవరం గారి మాటలు మీ లాంటి పరి"పక్వత" వచ్చిన వారికి, అపరిపక్వంగా ఉండటం లో ఆశ్చర్యం ఎ మాత్రం లేదు, LOL

    ReplyDelete
  8. @krishna

    మీదొరలకు కాల్లు మొక్కడం నీకు బాగా అలవాటయినట్టుంది, నీ అలవాటును ఎదుటివారిపై ఎందుకు రుద్దుతావు? సీమాంధ్ర్లంతా నీఅంత నికృష్టులని నేననుకోను. సూటిగా సమాధానం చెప్పలేని వెధవ మూర్ఖులంతా వెటకారాలకు దిగి ఏదో సాధించామని అల్పసంతోషం పొందుతారు, కొంచెం సంస్కారం పెంచుకో.

    ఏ బ్లాగులో చూసినా దొర, కాల్మొక్త అని రాస్తవు నువ్వు రోజు అదే పనిలో వుంటవా? డల్లాస్లో ఎవడి కాల్లుమొక్కుతున్నావు? మాకు నీలాగా కాల్లుమొక్కే అలవాటులేదుకానీ నీలాగా వెధవ తెలివి చూపిస్తే కాల్లు విరగ్గొట్టడం బాగా తెలుసు, జాగ్రత్త.

    ReplyDelete
  9. /మీ వాదనలు అపరిపక్వంగా ఉన్నాయి .ప్రజలకు విషయాలు భాగానే అర్థం అవుతాయి / :)
    ఆయన పరిశీనలకేం వాస్తవంగా, ఆలోచింపజేసేవిగా వున్నాయి.

    మీ వాదనలే ... మరీ పరిపక్వంగా కుళ్ళి, రాలిపోయే దశలో వున్న పిందెల్లా వునాయి. :)

    ఈ తెలంగాణ లొల్లి మొదలెట్టించిందే కాంగ్రెస్, తె.దె.పా కెసిఆర్ లాంటి ద్రోహులతో ముంచాలని. కెసిఆర్‌ను ఆర్థికంగా బలపరచడానికి మంత్రిపదవులిచ్చి దోచుకోమంది. ఇక్కడ రాజేసిన జనాలు అసహనం అయిపోతుంటే రిజైన్ చేసొచ్చి మళ్ళీ డ్రామా ఆడాడు, దొంగ దీచ్చలు చేశాడు, ఈ గొట్టం ముక్కుగాడు పోతాడు అంటూ తెలంగాణా ప్రక్రియ షురూ చేస్తున్నం అన్నారు. ఈ ఎదవలకు తోడు కేంద్రంలో ఆ సాంబర్ ఎదవ ఓవర్ ఆక్షన్. మూర్ఖ ప్రజలు(ఇగ్నోరంట్ అంటే కొంతమందికి అర్థం కాలేదని) 'గవన్నీ మాకు తెల్వద్, తెలంగాన గిచ్చుడో, తగలెట్టుకుని సచ్చుడో' అని బ్లాక్మెయిల్ చేశారు. అందుకే 6నెల్లకో సారి, అదిగో భూకంపం ఇదిగో సునామి, ప్రళయం, అగ్నిప్రమాదాలు, సృష్టిస్తాం అని ఈ ముక్కోడు, చెబుతూ కథకళి చేస్తూ, కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. వెర్రి నషాలానికెక్కిన అలగా జనం ఎవరి మంచి మాటలు వినేట్టు లేరు, ఒక్క సి.ఆర్.పి.ఎఫ్ మాటే వింటారు. అది చేస్తే ఓట్లు పోతాయేమో అని సోణెమ్మ భయం. ప్రాంతీయ పార్టీలను అస్థిర పరచడానికి ఇందిరమ్మ పంజాబ్లో చేసిన ఎదవపనే చదువురాని సోణెమ్మతో కాంగ్రెస్ ముసలినక్కలు చేయిస్తున్నారు.

    ReplyDelete
  10. Well said Krishna.
    These people don't know what is India(having ruled by Nizam, without participating in freedom struggle). Their exalted Highness Nizam tried to merge these sheep with Pakistan! Thanks to Indian Army's timely action, Hyderabad State was liberated and given democracy, but still some in the region are behaving like Talibans the barbariyans.

    Hope CRPF crush these uncivilized agitating Telabans and restore some democratic sense by canning. :)

    ReplyDelete
  11. @Snkr

    We have not begged our freedom like you did with British, we fought it hard way and we know the value of it. Now if you seema "andhas" try to colonize our place again, we know how to liberate ourselves.

    With your misanthropic, fascist and racist attitude to wish to crush the people's agitation you don't deserve to be a human. With your fascist comments you are proving how inhuman you are.

    ReplyDelete
  12. /begged freedom/ :)) Oh I see. Your knowledge is amazing, yaar!! :))

    Okay, try to LIBERATE again... we will help you by donating 2L of Petrol.

    /misanthropic, fascist and racist attitude to .. blah blah../
    How about words like Boorjuva, Fyuedal, anti-socialist, Capitalist etc etc..? huh..

    ప్రజాస్వామ్య, నాగరిక దేశంలో కలిసివుండలేమనుకున్న వారికి 'ద్వారములు తెరిచియే వున్నవి'... దయ చేయుడీ.. Nice to hear such hidden agenda, though sounds stupid. :)

    ReplyDelete
  13. @Snkr

    You ask CRPF to kill people and crush agitation, do you want to eat the dead bodies once it is crushed Mr. Cannibal?

    ReplyDelete
  14. "మాకు నీలాగా కాల్లుమొక్కే అలవాటులేదుకానీ నీలాగా వెధవ తెలివి చూపిస్తే కాల్లు విరగ్గొట్టడం బాగా తెలుసు"
    ----
    అవునా!! అందుకేనా పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సిన కాంగీ బిల్లు పెట్టకపోయినా, కాంగీని బలపరుద్దాము అని దొర అనగానే, గొఱ్ఱెలు లాగా కాల్మొక్కింది, అందుకేనా దొర అల్లుడు కాస్త పెట్రోలు పోసుకొని డ్రామా షురూ చేయగానే, వరసబెట్టి పోసుకొంది, మరి ఆ పోసుకొనేది అప్పటివరకు ఏమయ్యిందో!!
    ఆనాడు చెన్నారెడ్డి, ఈ నాడు ఈ దొర నిరుద్యోగులు అయ్యేంతవరకూ ఎందుకు ముసుగుతన్ని పడుకొన్నారో చెబ్తారా?

    కాళ్లు ఏమి విరగకొడతావులే కాని, సమైక్యం అంటున్నా ఒవైసీ గెడ్డం లో, ఓ వెంట్రుక పీక గలిగితే పీకండి, లేకపోతే ఉన్నాయిగా విగ్రహాలు వాటిని పగలగోడుతూ "ఈర"తెలబానుల గొప్పదనం తెలియచెప్పండి :)
    మనలో మాట "నేను సైతం" గారు, మీరూ నేనుసైతం అంటూ పెట్రోల్ డబ్బా ఎప్పుడు కొంటున్నారు :) ఇక్కడ జనాలు వెయిటింగ్ :) ఈమధ్యన పనికిమాలిన తెలబానుల జనాభా పెరిగిపోతుంది అని :)

    btw, సాటి తెలంగాణా వాళ్ళు అందరూ, మీ లాగా దొరకు కాల్మొక్కుతూ, మీద కిరసనాయలు పోసుకొన్టూ, విగ్రహాలు పగలగొట్టే తెలబానులు అనుకోను నేను, lol.
    సంస్కారం గురించి తెలబానులు మాట్లాడటం అసహ్యం గా ఉంటుంది అని మీకు అనిపించటం లేదు, అనిపించకపోవచ్చు, అలా అనిపిస్తే తెలబానులు ఎందుకు అవుతారు!!!

    ఇక ఈ టపా వరకు వస్తే, ఇస్తాము అని 2004 లోనే చెప్పి, బలం ఉన్నా, పార్లమెంట్ లో బిల్లు పెట్టని బంగారమ్మను, ఆమెకు ఊడిగమ్ చేస్తున్న దొర ను, కనీసం రాజీనామాలు ఇవ్వలేని నాయకులను అనకుండా, jc దివాకర్ మీదో, కావూరి మీదో, లగడపాటి మీదో, ప్రొద్దున లేస్తే చంద్రబాబు మీదో blame game ఆడుతూ, వాళ్ళను నిన్దిస్తూ (అసలు వాళ్ళను వదిలిపెట్టి) విగ్రహాలు పగలగొడితే ఉపయోగం ఏమిటి?

    ReplyDelete
  15. @krishna


    నువ్విక్కడ ఇప్పటికే నీ చత్త మాటలతో బ్లాగు విషయం మీద చర్చ జరక్కుండా చేసావు, ఇంకా దాని గురించి ఎందుకులేగానీ ఇంతకూ నువ్వు రోజూ ఎవరి కాల్లు మొక్కుతావు, బాబు గాడిదా, జగన్ గాడిదా? అందరూ నీలాగే అనుకోకు.

    బంగారమ్మ అప్పుడు బిల్లు పెట్టకపోవడానికి కారణం మీ గొర్రెలు ఫాక్షనిస్టు గాన్ని లీడర్‌ను జేసి ముఖ్యమంత్రిని జేస్తిరి, ఎక్కువ మాట్లాడితే వాడు కడపబాంబులేస్తడేమోనని అడగలేదు. మాకు మీలా రౌడీ బాగ్రౌండు లేదు కదా? మజ్లీసోడి గడ్డం పీకుదామన్నా వాడుకుడ మీ ఫాక్షన్‌ముఠాలు తన వెనుక ఉన్నారనే ధర్యంతో రెచ్చిపోతుండు, అందుకే ఆడికి రాయల తెలంగాణా కావాలట, వాడి రౌడీఇజానికి మీ ఫాక్షనిజం కలిసొస్తదని. వాడి కాల్లు విరగ్గోట్టడం మాచాతకాదు గని నువ్వు సాఫ్ట్ టార్గేట్ కదా, జాగ్రత్త.

    ఇంకోమాట, మేము విడిపోవాలనుకోవడానికి కారణం మీ గొర్రెలే, ఎప్పుడూ రౌడీలనూ, రక్తచరిత్రలను నాయకులను జేస్తరు, వారొచ్చి మామీద పెత్తనం జెయ్యకుంట ఉండడానికి విడిపోవాలనుకుంటున్నం, గొర్రెవు నీకెలాగు కసాయివారి బాధ తప్పదు మనుషులం మమ్మల్నన్న మంచిగ బతకనీ.

    ReplyDelete
  16. @krishna


    ఛ, నీలాంటి నికృష్టులకు సమాధానం చెప్పడం కోసం నేణు కూడా నీలెవెల్‌కు దిగజారాల్సొస్తుంది, ఏం జేస్తం మాఖర్మ. మీకు రాజధానికి గతిలేదని సరేలే కలిసుందామంటే మీరు మాదగ్గరికొచ్చి ముఠా తగదాలు, కడపబాంబులు, వేటకొడవల్ల సంస్కృతి తీస్కొస్తిరి, ఇంకా మాకొద్దీ ఖర్మ, మామానాన మేం విడిపోతమంటే నీకొచ్చిన భాదేందో జెప్పక గప్పుడెందుకు అడగలేదు, గిప్పుడెందుకు అడగలేదని బుకాయింపు మాటలెందుకు జెప్తవ్?

    ReplyDelete
  17. కాల్మోక్కటం వరకూ వస్తే , మా ఇంట్లో ఆడాళ్ళు కుడా మందు తాగుతారు, బూతులు మాట్లాడం మా సంస్క్రతి అనేవాడికి మాత్రం కాదు. Am I clear?.

    "నీ చత్త మాటలతో బ్లాగు విషయం మీద చర్చ జరక్కుండా చేసావు"
    ---
    చ్చా, నిఝంగా!!! కావూరి ని, లగడపాటిని, బాబుల మాట ఎత్తినది ఎవరు? వార్కి సమాధానం చెప్పా, అలా చెబితే మధ్యలో దూరి సంస్కారం , కాళ్లు అంటూ మాట్లాడిన వెధవ ఎవరో!!! గుర్తుకు రావటం లేదు కదూ :)

    "బంగారమ్మ అప్పుడు బిల్లు పెట్టకపోవడానికి కారణం మీ గొర్రెలు ఫాక్షనిస్టు గాన్ని లీడర్‌ను జేసి ముఖ్యమంత్రిని జేస్తిరి, ఎక్కువ మాట్లాడితే వాడు కడపబాంబులేస్తడేమోనని అడగలేదు."
    -----
    అవును మరి ఆయంకు తెలంగాణా లో వోట్లు పడలేదు కదూ :) అసలు 2004 లో పొత్తు పెట్టుకొని, మంత్రి పదవులు తీసుకొన్నది ఎవరో !!
    బుఱ్ఱ తక్కువ అని తెలుసుకానీ మరీ ఇంతనా!! నిజమే బంగారమ్మ మంచిది, ysr చెడ్డవాడు lol, ఇదీ ఇంకో తెలబాన్ theory యేనా?

    "వాడి కాల్లు విరగ్గోట్టడం మాచాతకాదు గని నువ్వు సాఫ్ట్ టార్గేట్ కదా, జాగ్రత్త. "
    -----
    good తెలబానులకు ఎంత దృశ్యం ఉందో గుర్తుతెచ్చుకొన్నదుకు :) ఇక ఈ బెదిరింపులకు, వీరంగాలకు మత్రం ఏమీ లోటు లేదు :)) బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరుకాని ఇక్కడ, వెళ్ళి ఇంకేమయినా విగ్రహాలు మిగిలి ఉన్నాయేమో చూసుకోండి :) లేకపోతే, కాస్త పెట్రోలు నెత్తిన పోసుకొని అంటించుకోవటం ఎటూ వుంది.

    "ఎప్పుడూ రౌడీలనూ, రక్తచరిత్రలను నాయకులను జేస్తరు, వారొచ్చి మామీద పెత్తనం జెయ్యకుంట ఉండడానికి విడిపోవాలనుకుంటున్నం"
    ------
    అవునుమరి, మందుబాబులు, దొంగనోట్లు , గల్ఫ్ కు అమ్మాయలను పంపటం, గుడిసెలు వేయించటం లాంటి చేసే వాళ్ల పెత్తనం బాగుంటుంది కదూ :) మన నాయకులు పత్తిత్తులు మరి!!

    "మనుషులం మమ్మల్నన్న మంచిగ బతకనీ."
    ----
    తెలబానులు మనుషులు, మంచిగా బతకటం, what a idea sir ji!!!

    ReplyDelete
  18. @నేను సైతం,
    తెలబాను లకంటే ఇంకా దిగజారుడు ఏమీ లేదు, it is rockbottom buddy (if you know what it means) :)

    విదిపోదామనుకొన్నా, కలసివున్దామనుకొన్నా, ఎవరిలేక్కలు వారివి, ముఖ్యంగా హైదరాబాదు దాని చుట్టుప్రక్కల జరిగిన అభివృద్ధి, దానిమీద వస్తున్నా ఆదాయం, చిన్న రాష్ట్రాలలో తమకు సాగే హవా నక్సలైట్లకు, మజ్లిస్ వారికయితే, వారి ముస్లిం డామినేషన్ మరియు రాజకీయ భద్రతా గట్రా.

    ఇక మీద కిరసనాయలు పోసుకొని ఆత్మత్యాగం చేసుకొని "నేనుసైతం "అంటూ అమరవీరుడవు అవుతావో, వెళ్లి విగ్రహాలు పగలగొట్టి వీరంగాలు వేస్తావో లేదో నీ ఇష్టం :)

    ReplyDelete
  19. క్రిష్ణ గారూ, ఆత్మాహుతి చేసుకున్న వారిగురించి చాలా హీనంగా మాట్లాడుతున్నారు, ఆనాడు కాంగ్రేస్ నాయకుల మాటలు విని బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు గారు కూడా మీదృష్టిలో గొర్రేనా? నేనయితే అలా అనుకోను, అతని త్యాగాన్ని గౌరవిస్తాను. ఎక్కడో ఆఫ్రికాలో ఒక వ్యక్తి బలిదానం చేసుకుంటే ప్రపంచం గౌరవిస్తుంది, సొంత రాష్ట్రంలో ఆరొందలబలిదానాలగురించి అంత హీనంగా ఎలా రాస్తున్నారు, ఎంత కసిఉంటే మాత్రం మరీ ఇలా మానవత్వం లేనివాడిలాగా రాస్తార?

    ReplyDelete
  20. @ జై తెలంగాణా,
    మీరు నా బాధ సరిగ్గా అర్ధం చేసుకోలేదనుకొంటున్నాను.

    ఎవడో గొట్టం దొర నిరుద్యోగి అయ్యి తన మామూళ్లు దందాలకోసం, మిగతా రాజకీయ పక్షాలు తమ తమ స్వార్ధ ప్రయోజనాలకోసం డ్రామాలు ఆడుతుంటె, మానసిక బలహీనతతో, కన్నవాళ్లకు, కట్టుకొన్న వారికి శోకాన్ని మిగిలిస్తూ మీద పెట్రొల్ పోసుకొనే వారిమీద నాకున్నది జాలి కాని కసి కాదు. నా దృష్టిలో బతికి ఏదయినా సాధించాలి కాని, మానసిక బలహీనతతో ఏడో దొరగాడు రెచ్చగొట్టితే రెచ్చిపోయి మనమీద ఆశలు పెట్టుకొన్నవాళ్లకు శోకాన్ని మిగులుస్తూ చచ్చే చావు "బలి"దానం కాదు, పిరికి తనం తో కూడిన పిచ్చి పని. ఇది సమిక్యాంద్ర కోరుతూ ఆత్మహత్య చేసుకొన్నా కొద్ది మందికి కుడా వర్తిస్తుంది.

    ఒక్కసారంటే ఒక్కసారి, ఈ దొర ఆయన సంతానం, బంధువర్గం లో ఒక్కళ్లంటే ఒక్కరు, రాజకీయనాయకులలో ఒక్కరంటె ఒక్కరు చావకుండా మనమెందుకు చావాలని ఈ మానసిక బలహీనులు ఎందుకు ఆలోచించరు? అలాంటి వారిని, అలాంటి పిచ్చి పనులను (విగ్రహాలు పగలగొడతం తో సహా) glorify చేసే వాళ్లంటే మాత్రం నాకు కసి, కోపం ఉంది, అది నిజమే!!

    ఒకవేళ పొట్టి శ్రీరాములు మానసిక బలహీనతతో, తాత్కాలిక ఆవేశం తో ఆత్మహత్య (which I doubt, read his personal background) చేసుకొని ఉంటే, ఆయన మీద కూడా నేను పడేది జాలి మాత్రమే సుమా!!

    Hope I made it clear,btw కాళ్లు విరగకొడతాము అంటూ పిచ్చి ప్రేలాపనలు చేయనందుకు (కొందరు తెలబానులు లాగా కాకుండా) నెనర్లు :)

    ఇక ఈ మానసిక బలహీనులు 600 మంది ఎప్పుడయ్యారు, ఏ లెక్కన? కాస్త list ఎక్కడుందో చెబుతారా?

    ReplyDelete
  21. జాలి చూపించేవారు చనిపోయిన వ్యక్తులను గొర్రెలతో పోల్చరు, మీరాతల్లో కనిపిస్తుంది జాళి కాదు, ద్వేషం, అవహేళన. కేవళం మీసొంతలెక్కలకోసం రాష్ట్రఏర్పాటుపై మీకున్న కోపంతో మానవత్వాన్నే వదిలేస్తే నష్టపోయేది మీరే.

    ఏ ఉద్యమంలోనూ నాయకులు త్యాగాలు చెయ్యరు, మీ ఆంధ్రరష్ట్ర ఉద్యమంలో కూడా అప్పటి కాంగ్రేస్ నాయకులెవరు త్యాగాలు చెయ్యలేదు. రేపు తెళంగాణా ఇస్తానంటే లగడపాటి, కావూరు చావరు.

    ReplyDelete
  22. "మీరాతల్లో కనిపిస్తుంది జాళి కాదు, ద్వేషం, అవహేళన. కేవళం మీసొంతలెక్కలకోసం రాష్ట్రఏర్పాటుపై మీకున్న కోపంతో మానవత్వాన్నే వదిలేస్తే నష్టపోయేది మీరే. "
    --
    అవునా? మరి మీ రాతలు, మీ దొరల మాటలు, నాలుకలు కోస్తాము, భాగో జాగో లు, గోడలు కట్టటాలు వాటిలో ప్రేమతత్వం, ఆ బుద్దుడంత దయామయ తత్వం కనిపించేవారికి అలా కనిపించటం లో ఏ మాత్రం తప్పు లేదు :)

    ఇక నష్టానికి వస్తే నష్టపోతుంది ఎవరో తెలుస్తానే వుంది, కిరసనాయలో, పెట్రోలో పోసుకొని తగలడి చస్తుంది ఎవరో, సినెమాల దగ్గరనుండి, ఇసుక, కాలేజీల వరకు దందాలు వసూళ్లు చేసుకొని బాగు పడుతుంది ఉద్యమం పేరుతో ఎవరో కూడా తెలియటం లేదా మీకు :)

    "రేపు తెళంగాణా ఇస్తానంటే లగడపాటి, కావూరు చావరు." so true, agree.

    అయితే ఎప్రాంతం లోనయినా సామాన్య జనాలు పెట్రోల్ పోసుకొని గొఱ్ఱెలు లాగా చావాల్సిందె నంటారా? దానిని glorify చేసుకొంటూ కొంతమంది బతకాల్సిందేనంటారా? వాటిని మనలాంటోళ్లు అందరూ సమర్ధించాలా?

    సరే అలాగే కానిద్దాం? ఇంతకీ 600 పనికిమాలిన చావులు(మీ దృష్టిలో బలి దానాలు) లెక్కలు ఎక్కడివో చెబుతారా? 600 count గ్రామ దేవతలకు బలి ఇచ్చిన గొఱ్ఱెలతో సహానా? లేక ఆ లెక్కలు తెలబానుల లెక్కలా?

    ఆరొందలు కంటే, ఆరొందల ఒక్కట్టి అంటే (కాకి లెక్క అయినా), అదే ఆత్మ దానాలు లెక్క బాగుంటుందేమో నని, "నేను సైతం" అంటూ రెండు లీటర్ల కిరసానయలు కొనుక్కోమనే నేనూ చెబ్తున్నది :)

    ReplyDelete