Tuesday, March 8, 2011

నాగం మరో దేవేందర్‌గౌడ్‌ అవుతారా?

టిడిపి శాసనసభాపక్ష ఉపనేత నాగం జనార్ధనరెడ్డి ఇప్పుడు వార్తల్లో వ్యక్తి. ఆయన వ్యవహారశైలి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌. ఇంతకూ నాగం టిడిపిలో ఉంటారా లేక పార్టీని వీడతారా? ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి టిడిపికి రాజీనామా చేశారు. టిఆర్‌ఎస్‌ పంచన చేరారు. త్వరలో ఎమ్మెల్యేగిరీకీ రాజీనామా చేస్తానన్నారు. ఇప్పుడు నాగం వంతు వచ్చింది. వాస్తవానికి నాగం వ్యవహారంతో టిడిపి అధినేత చంద్రబాబు కొంత కాలంగా తలనొప్పులను ఎదుర్కొంటున్నారు. గతంలో ఒకసారి చంద్రబాబు తెలంగాణ నేతల సమావేశం ఏర్పాటు చేసి ఒకరిద్దర్ని వదులుకోవడానికి సిద్ధమంటూ సంకేతాలు పంపారు. అప్పట్లో నాగం, బాబు మధ్య చర్చలతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగిందని అనిపించినా తరచు నాగం ధిక్కారస్వరం వినిపిస్తూ వచ్చారు. మోత్కుపల్లి వంటి నేతలు నాగం వైఖరిని తప్పుబడుతున్నారు.

గవర్నర్‌ ప్రసంగం రోజు టిఆర్‌ఎస్‌ కంటే టిడిపి ఎమ్మెల్యేలే నానా యాగీ చేశారన్న అపవాదును మూటగట్టుకున్నారు. చివరికి ఇద్దరు ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇదంతా నాగం పనేనన్న ఆరోపణలున్నాయి. నాగం వైఖరిని టిడిపి సీమాంధ్ర ఎమ్మెల్యేలతోపాటు తెలంగాణ ఎమ్మెల్యేలు సైతం వ్యతిరేకిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం చెప్పాలని నిలదీయాలనుకున్న టిడిపి తరచు తానే ఇబ్బందుల్లో పడి గిలగిల కొట్టుకుంటోంది. కాంగ్రెస్‌ నేతలు టిడిపిని వ్యూహాత్మకంగా ముగ్గులోకిలాగి వారు చోద్యం చూస్తున్నారు. తమ వైపునుండి ప్రజల దృష్టిని టిడిపివైపునకు మళ్లిస్తున్నారు. కాంగ్రెస్‌ ఉచ్చులో టిడిపి పడుతోంది. అందుకు నాగం లాంటి నేతలు బాగా ఉపయోగపడుతున్నారు. అటు టిఆర్‌ఎస్‌ సైతం కాంగ్రెస్‌ కంటే టిడిపినే ప్రధాన శత్రువుగా ఎంచుకొని 'దాడి' చేస్తోంది. ఈ దాడులతో టిడిపి గుక్కతిప్పుకోలేకపోతోంది.

ఇక నాగం విషయానికొస్తే సోమవారం అసెంబ్లీలో బాబు ముందే నినాదాలు చేయడం, తాను ఒక్కడిని కాదంటూ హెచ్చరించడంతో పరిధిని దాటినట్లు అనుకోవాలి. బాబు సమక్షంలోనే టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడం ద్వారా టిడిపిలో అంతర్గత విభేదాలు అసెంబ్లీ వేదికపై బయటపడ్డాయి. నాగంకు టిడిపి ఎమ్మెల్యేలెవరూ మద్దతు తెలపకపోవడం గమనార్హం. సాయంత్రానికి బాబు రాజీ ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికప్పుడు రాజీ కుదిరినా నాగం వ్యవహారం భవిష్యత్తులో టిడిపికి తలనొప్పులు తెచ్చిపెడుతుందనే అభిప్రాయంతో నేతలున్నారు.

తొలుత టిడిపిలో దేవేందర్‌గౌడ్‌ నెంబర్‌టుగా నిలిచారు. ఆయన బయటికెళ్లాక నాగం ఆ స్థానాన్ని ఆక్రమించారు. దేవేందర్‌ నవ తెలంగాణ పార్టీపెట్టి, ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరి, మళ్లీ టిడిపి గూటికి చేరారు. దేవేందర్‌ పార్టీలోకొచ్చాక నాగంకు ప్రాధాన్యత తగ్గింది. అందువల్లనే నాగం ధిక్కార స్వరం వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ నాగం బయటికెళితే ఆయన వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు, నేతలు వెళతారు? దేవేందర్‌గౌడ్‌ అనుభవం కళ్లముందుండగా నాగం పార్టీని వీడే సాహసం చేస్తారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతానికి జవాబుల్లేవు. పోచారం పార్టీని వీడినా ఆయనకు ఇబ్బందేమీలేదు. ఆయన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో టిడిపి టిక్కెట్‌ ఇవ్వదని తెలిసే ఆయన పార్టీని వీడారంటున్నారు. నాగం పరిస్థితి వేరు. ఆయనకు దేవేందర్‌కు పట్టిన గతి పడుతుందంటున్నారు టిడిపి తెలంగాణ నేతలు.

5 comments:

  1. మైలవరం గారూ
    మీ విశ్లేషణలో నిష్పాక్షికత లోపించింది. అందుకు
    తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పట్ల మీకున్న వ్యతిరేకతే కారణం అనుకుంటాను.

    >>>>>>>
    1..... వాస్తవానికి నాగం వ్యవహారంతో టిడిపి అధినేత చంద్రబాబు కొంత కాలంగా తలనొప్పులను ఎదుర్కొంటున్నారు.
    2..... కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం చెప్పాలని నిలదీయాలనుకున్న టిడిపి తరచు తానే ఇబ్బందుల్లో పడి గిలగిల కొట్టుకుంటోంది.
    3..... కాంగ్రెస్‌ ఉచ్చులో టిడిపి పడుతోంది. అందుకు నాగం లాంటి నేతలు బాగా ఉపయోగపడుతున్నారు. అటు టిఆర్‌ఎస్‌ సైతం కాంగ్రెస్‌ కంటే టిడిపినే ప్రధాన శత్రువుగా ఎంచుకొని 'దాడి' చేస్తోంది. ఈ దాడులతో టిడిపి గుక్కతిప్పుకోలేకపోతోంది.
    4..... దేవేందర్‌ పార్టీలోకొచ్చాక నాగంకు ప్రాధాన్యత తగ్గింది. అందువల్లనే నాగం ధిక్కార స్వరం వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
    5..... ఆయనకు దేవేందర్‌కు పట్టిన గతి పడుతుందంటున్నారు టిడిపి తెలంగాణ నేతలు.
    <<<<<<<

    1 ) వాస్తవానికి టీడీపీ నేతలు, కార్యకర్తలే చంద్ర బాబు వ్యవహార శైలి, పక్షపాత ధోరణి వల్ల తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. ఎవరికీ ఆయన జిత్తులమారి రెండుకళ్ళ సిద్ధాంతం మింగుడు పడటం లేదు.

    2 ) కాంగ్రెస్ ను నిలదీయడం వల్ల కంటే తనకే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై ఒక స్పష్ట మైన వైఖరి లేక పోవడం వల్లనే , తన హిడెన్ సమైక్యవాద ఎజెండాను అమలు పరచలేక తరచూ కుడితి లో పది కొట్టుకుంటోంది. ఒక స్పష్టమైన సిద్ధాంతం లేకుండా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది.

    3) కాంగ్రెస్ ఉచ్చులో తీ డీ పీ పడటం కాదు తను తవ్వుకున్న గోతిలో తనే పడుతోంది. అందుకు చంద్రబాబే , ఆయన రెండుకళ్ళ సిద్దాన్తెమే కారణం.

    4) దేవేందర్ పార్తీలోకొచ్చాక దేవెందరే పులి నుంచి పిల్లి లా మారారు. ఆయన వల్ల నాగం ప్రాధాన్యత తగ్గడం ఏమిటి ? దేవేందర్ వెనక బాబు వున్దోచ్చేమో కాని జనం ఎవరూ లేరు. ఆయన మాటలకు తెలంగాణా లో పూచిక పుల్ల విలువ లేదు.

    5) దేవేందర్ కు పట్టిన గేటు నాగం కు పడుతుంది ఎప్పుడు చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని, ఆయన హిడెన్ సమైక్యవాద ఎజెండాను అమలు పరుస్తూ అదే టీడీపీ లో పది వుంటే. బయటకు వస్తే నాగం కు తెలంగాణా ప్రజలు బ్రహ్మ రధం పడతారు.

    ఎందుకంటే దేవేందర్ గౌడ్ బయటికి వేల్లిననాటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు.

    ఇవన్నీ మీ అంత రాత్మకు తెలియవని కాదు. కాక పొతే మీరు ధరించిన కళ్ళ జోడు ప్రభావం వల్ల అలా అనిపిస్తోంది,

    ReplyDelete
  2. /బయటకు వస్తే నాగం కు తెలంగాణా ప్రజలు బ్రహ్మ రధం పడతారు/
    బ్రహ్మ రధం పడతారు, కాని ఇప్పటికే అందులో స్థలం చాలక వేలాడుతున్న 1001మంది బోడిలింగాల్లో ఈయన ఓ బోడిలింగం అవరన్న గ్యారంటీ ఏమిటి? :)

    ప్రసాదరావు గారు, మీ విశ్లేషణ బాగుంది, కొంతమంది ఫెనటిక్స్‌కు నచ్చకపోవడమే అందుకు తిరుగులేని నిదర్శనం, కొనసాగించండి.

    Please remove irritating word verification - Thanks.

    ReplyDelete
  3. ఉస్మేనియాలో పడిన దెబ్బతో నాగం గారికి మెదడులో బ్లాక్స్ ఏర్పడ్డాయేమో లేదా ఓవరాక్షన్ చేసి చాంపియన్ అయిపోదామని అనిపిస్తూ వుండవచ్చు.

    ReplyDelete
  4. " కాక పొతే మీరు ధరించిన కళ్ళ జోడు ప్రభావం వల్ల అలా అనిపిస్తోంది," Sooo true :)

    బాబ్బాబు మీరు అర్జంటుగా తెలబాన్ కళ్లజోడు పెట్టుకోండి, దొరకు ఎలా కాల్మొక్కాలో, మా ఇళ్ళళ్లొ ఆడోళ్లు కూడా మందు తాగుతారు, మందు తాగటం, బూతులు మాట్లాడటం మా సంస్కృతి అంటూ తమ సంస్కృతిని తామే ఎలా కించపరచుకోవాలో, నాలుకలు కోస్తాం గట్రా వీరంగాలు ఎలా వేయాలో, అన్నిటికంటే బంగారమ్మను (తెలగాణా)దేవతను చేస్తూ, కాంగీని బలపరచమంటూ దొర చెప్పేదానికి మీ అంతరాత్మ ఉప్పొంగి, ప్రపంచమంతా "పింకు, పింకు గా" కనబడుతుంది.

    తప్పంతా తెలబాను కళ్లజోడు పెట్టుకోకుండా బ్లాగులు వ్రాసే మీలాంటోళ్లదే!! :)

    ReplyDelete
  5. @ మైలవరం

    చంద్రబాబుకు నంబర్ టూ ఫోబియా ఉంది. పార్టీలో ఎవరు కాస్త ఎదిగి తన తరువాతి స్థానంలోకి వస్తారో వారి వాల్లు తనపైన తిరుగుబాటు (తను తన మామపై చేసినట్టు) చేస్తారేమోననే భయంతో వారిని పొమ్మనకుండానే పొగ పెట్టడం చంద్రబాబుకు అలవాటు. ఇంతకుముందు దేవేందర్ గౌడ్, దగ్గుపాటి, హరిక్రిష్ణ లాంటి ఉదంతాలు చానా ఉన్నాయి. ఒకరిద్దరిని పైకి కూడా పంపించాడని చెబుతారు. ఇప్పుడు అలాగే రేవంత్‌రెడ్డి,మొత్కుపల్లి లను రెచ్చగొట్టి నాగంకు పొగపెడుతున్నాడు. అంతేకానీ మీరన్నట్లు నాగం చంద్రబాబుకేమీ తలనొప్పులు తీసుకురాలేదు.

    అయితే ప్రస్థుత పరిస్థితి దేవేందర్‌గౌడ్ వెల్లినప్పటి పరిస్థితి కంటే పూర్తిగా భిన్నమయింది. ఇప్పుడు తెలంగాణాలో తెదేపా మునిగిపోయే పడవ. అందులోనుంచి ఎంతత్వరగా బయటికి వస్తే తెలంగాణా తెదే లీడర్లకు అంత మంచిది.

    ReplyDelete