మంత్రి, ఎమ్మెల్యే, ప్రొఫెసర్... ఏ ప్రాంతం వారైనా సరే ఈ బాధ్యతల్లో ఉన్నవారు అనాలోచితంగా, అవకాశ వాదంతో, ఆందోళనకరమైన రీతిలో మాట్లాడితే ప్రజలకు వారి పట్ల గౌరవం తగ్గుతుంది. విసుగు, రోత, ఏహ్య కలుగుతాయి. కీలకమైన బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడితే అంతగా వారికి, వారి కుర్చీలకు హుందాతనం వస్తుంది. ఆ వ్యక్తులే బాధ్యతారహితంగా మాట్లాడితే వారిపట్ల వ్యతిరేక, నిరసన భావం ప్రజల్లో, వారి అభిమానుల్లో వేళ్లూనుకుంటుంది. రాష్ట్ర హౌం మంత్రి సబితారెడ్డి మిలియన్‌మార్చ్ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై చోటు చేసుకున్న ఘటనలపై అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. మహనీయుల విగ్రహాల కూల్చివేతను ఖండించారు. అంతవరకూ బాగానే ఉంది. పోలీసులు ఎందుకు వైఫల్యం చెందారని విపక్షాలు ప్రశ్నిస్తే 'మిలియన్‌మార్చ్‌కు వచ్చేవారందరూ మన బిడ్డలు, మన సోదర సోదరీమణులు, వారిపై కఠినంగా ఎలా వ్యవహరిస్తాం?' అని చెప్పుకొచ్చారు.
ఆందోళనకారులు మన వారే మన తెలుగువారే సందేహం లేదు. మన తెలుగు తేజాలను మన తెలుగువారే నేలకూల్చారు. ఇదీ నిజమే. ఈ దుశ్చర్యలను ఎందుకు అడ్డుకోలేకపోయారని అడిగితే హౌం మంత్రి సమాధానం విచిత్రంగా ఉంది. 'మిలియన్‌మార్చ్‌కు వచ్చేవారు సీమాంతర ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు కారు. మన బిడ్డలే' అని అన్నారు. మరి మావోయిస్టులెవరు? మన బిడ్డలే కదా? వారూ సమస్యలపైనే వారి పంథాలో పోరాడుతున్నారు కదా? మరి వారిపై ఎందుకు ప్రభుత్వం నిషేధం విధించినట్లు? ఎందుకు వారిని చట్ట వ్యతిరేకంగా పరిగణించి ఎన్‌కౌంటర్లు చేస్తున్నట్లు? బాబ్రీ మసీదును కూల్చిందీ మన దేశ బిడ్డలే అని ఊరుకుందామా? మక్కా మసీదు, లుంబిని, గోకుల్‌చాట్‌లో బాంబులు పేల్చింది, బెస్ట్ బేకరీ, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేసింది మన బిడ్డలే అనుకుందామా?
నాగం జనారన్‌రెడ్డి చాలా సంవత్సరాలు మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం టిడిపి శాసనసభాపక్ష ఉపనేత. రాజ్యాంగబద్ధ ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) ఛైర్మన్, సీనియర్ ఎమ్మెల్యే. ఆయనంటారు... తెలంగాణాపై అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంట్‌లో బిల్లు పెట్టకపోతే జపాన్ తరహా భూకంపాన్ని తెలంగాణాలో సృష్టిస్తామని హెచ్చరించారు. ఈజిప్టు తరహా ఉద్యమం అంటే అర్థముంది. ప్రభుత్వాన్ని, హైదరాబాద్ నగరాన్ని లక్షలాది ప్రజలతో దిగ్బంధిస్తే అది ఈజిప్టు తరహా అవుతుంది. జపాన్‌తో పోలికేంటి? జపాన్‌లో జల ప్రళయం, సముద్రగర్భంలో భూకంపం (సునామీ) సంభవించి పట్టణాలు, ఊళ్లు కొట్టుకుపోయాయి. జపాన్ విలయంపై ప్రపంచం యావత్తు సంఘీబావం ప్రకటించింది. ఆందోళన చెందుతోంది. ఆ భూకంపంతో తెలంగాణ ఆందోళనలతో పోలికేంటి? ఒక వేళ పోలికపెడదామనుకున్నా తెలంగాణాలో సముద్రం లేదు. హుస్సేన్‌సాగర్‌లో సునామీ రాదు. పోని సముద్రమేమో మీ బద్ధ వ్యతిరేకుల ఆంధ్రా వాళ్ల చెంత ఉందాయె!
ప్రొఫెసర్ కోదండరాం. అసెంబ్లీ చచ్చిపోయింది దానికి తొలి మాసికం, పిండం పెడతామంటున్నారు. రాజ్యాంగంపై, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై, ఈ వ్యవస్థపై నమ్మకం లేని వాళ్లు ఈ మాట అంటే తప్పులేదు. చట్టసభలను పందుల దొడ్డితో పోల్చారు నక్సలైట్లు. వారి విధానం వారిది. అసెంబ్లీలో తీర్మానం చేయాలి, పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలి అని ప్రతిక్షణం డిమాండ్ చేసే ప్రొఫెసర్ కోదండరాం ఆ చట్టసభలకే పిండం పెడితే ఎక్కడ బిల్లులు, తీర్మానాలు పెట్టుకుంటారు? తెలంగాణాను భారత దేశంలో అదీ ఈ రాజ్యాంగ పరిధిలోని చట్టసభలతో సంబంధం లేకుండా విభజిస్తారా? పార్లమెంట్‌లో బిల్లు రాకుండా తెలంగాణ రాష్ట్రం వస్తుందని నమ్ముతున్నారా? అసెంబ్లీకి పిండం పెట్టడమంటే రాజ్యాంగానికి పిండం పెట్టడమే అవుతుంది కదా?
627 మంది ఆత్మబలిదానం చేసుకుంటుంటే అప్పుడు మీరు మీలాంటి వారు కిమ్మనకుండా ఉండిపోయారెందుకు. ఎన్నికలలో అన్ని పార్టీల నాయకులు తెలంగాణ ఇస్తామని చెప్పి ఆ తరువాత చేసిన మోసంపై మీరు మీలాంటివాళ్ళు కిక్కురుమనరెందుకు.
ReplyDeleteతెలంగాణ రాష్ట్రమివ్వమంటే ఎదో దేశద్రోహులమన్నట్టు రెచ్చగొడతారెందుకు.
ఈ రాక్షస రాజ్యంలో నరహంతకులకన్నా కౄరమైన పాలకులు మౌనంగా చేసే వికృత చేష్టలు మరియు కపట వివక్షాల ఫలితమే ఈ చర్య. కఠినపు కన్నులకు కూలిన విగ్రహాలు మాత్రమే కనపడి ఎంతో బాధ కలిగినట్టు మీ మనసులు విలపిస్తే మరి గత 50 ఏళ్ళుగా గాయపడిన హృదయాలు మరియు కూలిన తెలంగాణ ప్రజల బతుకులు మాకెంత బాధ కలిగించాయో గ్రహించండిరా కామెర్లు కమ్మిన మూర్ఖులారా.
/పార్లమెంట్‌లో బిల్లు పెట్టకపోతే జపాన్ తరహా భూకంపాన్ని తెలంగాణాలో సృష్టిస్తామని హెచ్చరించారు./
ReplyDelete:)) నమ్మే గొర్రెలు వున్నారు కాబట్టే అలా అన్నారు. కెసిఆర్ సృష్టించడం లేదా, భూపంకం? ఎంత మూర్ఖ తెలబాన్లైనా మరీ జపాన్ తరహా పుట్టిస్తామని జోకడమా!! ROFL. నా వోటు నాగం జనార్ధనరేడ్డి గారికే, ఆయనే ఉద్యమానికి తగిన నాయకుడు. :D
అట్లు పోసుకునే ఎంకమ్మను హోమ్ మినిస్టర్ చేస్తే ఇలాంటి చట్నీ స్టేట్‌మెంట్లు గాక మరేమి ఆశించగలం? మన బిడ్డలకు పోలీసులెందుకు అని హోం శాఖను మూసేయాలి, ఎంకమ్మ ఆట-పాట, రోడ్డుమీదే-దోశలు, కంబళి గేయాలు, గెంతులు లాంటి 'తెలబాన్ సాంస్కృతిక' కార్యక్రమాలకు సారథ్యం వహిస్తే అలరించిన వారవుతారు.
earth quake create chesina taruvaatha poyedi telangana praanthame..... :)
ReplyDelete'మిలియన్‌మార్చ్‌కు వచ్చేవారు సీమాంతర ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు కారు. మన బిడ్డలే'
ReplyDeleteఆవిడ ధైర్యంగా ఈ మాట అసెంబ్లీలోనే 'అధ్యక్షా అధ్యక్షా" అంటూ పది సార్లు చెప్పింది. దీన్ని బట్టి ఈ మార్చ్ కి సాక్షాత్తూ అట్ల ఎంకమ్మ గారి సపోర్టు ఫుల్లు గా ఉందన్నమాటేగా!
ఎంతసేపూ తెలంగాణ లో ఇంతమంది బలిదానాలు చేసుకున్నారు అని ఏడుస్తున్నరే, అసలు వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించింది మీరు కాదా? YS చనిపోయాక జగన్ చావు రాజకీయాలు నడపడం చూసి మీరు కూడా దిగజారిపోయారు, కాదంటారా? ఎప్పుడూ తల తీసుకుంటా పీక కోసుకుంటా ముక్కు రాసుకుంటా అనే డైలాగులతో ముక్కన్న రెచ్చగొట్టడం వల్లే కదా అమాయకులైన students ఆత్మహత్యలు చేసుకున్నారు?
ReplyDelete