మ్యాచ్ ఫిక్సింగ్... కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఈ మాట బాగా వినిపిస్తోంది. ఒకరిపై ఒకరు మీరు ఫలాన వారితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తరచు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు నేతలు. ఏ రోజు ఎవరు ఈ మాట అంటారో, ఎవరు ఏ రోజు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారో తెలీక ప్రజలు గందరగోళంలో పడుతున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదం గతంలో టిడిపి, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ మధ్య ఆరోపణగా సాగింది. ఈ మూడు పార్టీల్లో ఒకరు మిగిలిన ఇద్దరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
ఇప్పుడు జగన్ గ్రూపు, టిడిపి, కాంగ్రెస్ మధ్య ఈ ఆరోపణ సాగుతోంది. జగన్, టిడిపి కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ ఒక రోజు అంటుంది. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కయ్యాయని జగన్ గ్రూపు మరుసటి రోజు విమర్శిస్తుంది. కాంగ్రెస్, జగన్ నాటకం ఆడుతున్నారని టిడిపి ఆ మరుసటి రోజు ఆరోపిస్తోంది.
ఇక టిఆర్‌ఎస్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని టిడిపి, కాంగ్రెస్ రెండూ అంటున్నాయి. ఇంతకీ ఎవరు ఎవరితో ఫిక్స్ అయ్యారో స్పష్టం కాకపోయినా ఆ పార్టీలు ఫిక్స్ అయి తమను 'ఫిక్స్' చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
No comments:
Post a Comment