శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమీబాలాంటిదంటున్నారు పలువురు రాజకీయ నేతలు. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అయితే ఎవరికిష్టమొచ్చినట్లు వారు నివేదికను అన్వయించుకోవచ్చన్నారు. శ్రీకృష్ణ నివేదికలో కొత్తదనం ఏమీ ఉండదని ఈ నెల 6న ఢిల్లీలో చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కెసిఆర్ హాజరు కాలేదు. కాని శ్రీకృష్ణ నివేదిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదని భాష్యం చెప్పారు. కెసిఆర్ అంతటి వారే నివేదికను తనకు అనుకూలంగా అన్వయించుకున్నారంటే సామాన్యులు ఆ పని చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు.
పది నెలలపాటు పరిశోధించిన శ్రీకృష్ణ కమిటీ ఆరు సూత్రాల పథకంవలే ఆరు సిఫారసులు చేస్తూనే మొదటి మూడూ ఆచరణ యోగ్యం కాదని తనే కొట్టిపారేసింది. నాలుగో సూత్రమూ అంత ఈజీ కాదంది. ఐదోది రాష్ట్ర విభజన. అనివార్యమైతే అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో రాష్ట్రాన్ని విభజించాలంది. ఐదో అంశానికి రెండో ప్రాధాన్యతా ఓటు వేసింది. ఇక ఆరోది సమైక్య రాష్ట్రంగా కొనసాగించడం. అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణా ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి దానికి రాజ్యాంగ/చట్టబద్ధ రక్షణ కల్పించాలంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల స్ఫూర్తి, అభివృద్ధి కోణాల్లో ఈ ఆరో సూత్రానికి కమిటీ మొదటి ప్రాధాన్యతా ఓటు వేసింది.
ఇంతకీ శ్రీకృష్ణ చెప్పిందేమిటి? సమైక్య రాష్ట్రం కొనసాగించాలంటూ సూచించిందని సమైక్యవాదులంటున్నారు. తెలంగాణా వాదులు హైదరాబాద్‌తో కూడిన 1956కు ముందునాటి తెలంగాణ రాష్ట్రం కావాలంటున్నారు. ఎవరి డిమాండ్లు, వాదనలు, భాష్యాలు ఎలా ఉన్నప్పటికీ శ్రీకృష్ణ ఆరు సూత్రాలు చెప్పి మొదటి మూడు ఆచరణయోగ్యం కాదని, నాలుగోది అంత ఈజీ కాదని పేర్కొంది. ఆచరణయోగ్యం కాని అంశాలు సిఫారసు చేయడమెందుకనేది ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్న. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచన్న మొదటి సిఫారసు ఆచరణ సాధ్యం కాదన్న కమిటీ మళ్లీ ఆరో సిఫారసులో సమైక్యరాష్ట్రమే బెస్టని, రాజ్యాంగబద్ధ గ్యారంటీతో తెలంగాణాను అభివృద్ధి చేయాలంది. ఇదీ గజిబిజి గందరగోళమే. ఏతావాతా చూస్తే అభివృద్ధికి ఓటేసింది.
అభివృద్ధి చేస్తే ప్రత్యేక వాదాలు తలెత్తవనేది ప్రాధమిక సూత్రం. ఇప్పటికైనా ఒక్క తెలంగాణాలోనే కాకుండా వెనుకబడిన ప్రాంతాలన్నింటినీ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తే ఎక్కడా ప్రత్యేక ధోరణులు, అశాంతి పుట్టవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న కాంగ్రెస్ తానే రెండుగా చీలిపోయి ఉద్వేగాలు రెచ్చకుండా అభివృద్ధి బాట పట్టాలి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చినందువల్ల రాష్ట్ర విభజనపై రాష్ట్రంలోని పార్టీలు తెల్చాలని చిదంబరం చెప్పడం హాస్యాస్పదం. కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించాలి. రాజకీయ లబ్ధి కోసం ప్రాంతానికో మాట ఆ పార్టీ నేతలు మాట్లాడకూడదు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు అన్ని పార్టీలూ స్పష్టమైన వైఖరితో ఉంటే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

SKC report is good. TRS is determined to reject any sensible report, unless they support their version. It is idiotic to expect sensible policy from TRS. The anti-people & anti-social parties should be subdued/crushed with strong force to establish peace &harmony. That is the only way left.
ReplyDelete"jootOn kO maane saitaan, baatOm se nahee maantaa" :)
First 4 are not options but requests came from various persons. The comitee itself ruled out the options.there is no confusion in the report, they said best option is united state with stand by as separate telangana. the comitte directly pointed as Telangana is equally backward with rest of the andhra. this will shutdown mouth of telabans.
ReplyDeleteI think, MHA should have distributed Telugu copies to Telugu Bloggers, Telugu paper reporters. See, these guys started intrepretting in their own-way!
ReplyDelete