Sunday, June 11, 2017
Friday, February 15, 2013
Saturday, July 16, 2011
బాదుడుకు వేళాయె...
బాదుడుకు మంచి సమయం..ఆలస్యం చేసిన ఆశాభంగం... అనుకుంటున్నట్లుంది కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రాంతీయ గొడవకు ఆజ్యం పోసిన కాంగ్రెస్ ఆ మంటల్లో బొగ్గులేరుకుంటోంది. రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రాంతాలవారీగా విడిపోయి భావోద్వేగాల్లో మునిగి ఉండగా బాదుడుకు ఇదే సరైన సమయం అనుకుంది ప్రభుత్వం. ఆర్టీసి బస్ ఛార్జీలను అమాంతం పెంచి ప్రజల వీపు విమానం మోత మోగించింది. మామూలు రోజుల్లో అయితే బస్ ఛార్జీలు పెరిగితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు పెల్లుబికేవి. విపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేసేవి. వారి ఆందోళనలకు మీడియాలో చోటు లభించేది. ప్రజలపై 500 కోట్ల రూపాయలను బాదినప్పటికీ ఈసారి పెద్దగా ప్రచారం రాలేదు. వామపక్షాలు మాత్రమే నిబద్ధతగా, సంప్రదాయ బద్ధంగా, తమ శక్తి మేరకు బస్ ఛార్జీల పెంపునకు నిరసగా ఆందోళనలు చేశాయి.
Friday, July 15, 2011
ఎందుకీ చిందులు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేసి రెండు వారాలవుతున్నా అధిష్టానంలో సుయ్యి సయ్యి లేదు. రాజీనామాలు చేసి తమ సంగతి తేల్చమని ఢిల్లీకి చక్కర్లు కొట్టిన నేతలు అక్కడ గర్వభంగం కావడంతో హైదరాబాద్‌కొచ్చి పడ్డారు. ఇక్కడ సిఎం, పిసిసి అధ్యక్షుడు బొత్సతో ఎడతెరపి లేకుండా భేటీల మీద భేటీలు వేసిన వారు 48 గంటల నిరశన దీక్ష చేపట్టారు. బుధవారం ఉదయం 10గంటలకు ప్రారంభించిన దీక్షలను శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగిస్తే 48 గంటలవుతుంది. కాని అర్థంతరంగా 14 గంటలకు ముందే దీక్షలను విరమించారు. దీక్షల ముగింపులో నేతలు ఏదో సాధించేసినట్లు చిందులేశారు. విచిత్రంగా డ్యాన్సులు చేశారు. ఏం సాధించినందుకు డ్యాన్స్ చేశారు?
Subscribe to:
Posts (Atom)