కాంగ్రెస్ కౌగిల్లోకి ప్రజారాజ్యం చేరుతుందా? ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ ఎందుకు అక్కున చేర్చుకుంటోంది? ఈ ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మంత్రివర్గంలో పిఆర్పి చేరికపై ఊహాగానాలు జోరందుకున్నాయి. పిఆర్పి ఏర్పాటే అనుమానాస్పదం. కాంగ్రెస్‌కు, టిడిపికి ప్రత్యామ్నాయని, సామాజిక న్యాయమని తిరుపతిలో పార్టీ ఏర్పాటు సభలో ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ పలుకులకు దూరం జరిగారు. ఎన్టీఆర్ వలే పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అవుదామనుకుంటే స్వయంగా చిరంజీవే ఒక నియోజకవర్గంలో ఓడిపోవడం విధి విచిత్రం. పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు పిఆర్పి పరిమితమైనప్పటికీ ఆ పార్టీకి 18 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల చీలిక మూలంగానే టిడిపికి అధికారం దక్కకపోగా చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకుంది. ఎన్నికల తర్వాత జెండా పీకేస్తారని, చిరంజీవి సినిమాల్లో నటిస్తారని వార్తలొచ్చాయి.
Monday, November 29, 2010
Sunday, November 28, 2010
'చిదంబర' రహస్యం!
రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కిరణ్‌కుమార్‌రెడ్డిని కూర్చోబెట్టడానికి కేంద్ర హౌం మంత్రి చిదంబరం తన వంతు సాయం చేశారా? ఈ ప్రశ్న కాంగ్రెస్ వర్గాలను తొలిచేస్తోంది. కిరణ్ సిఎం కావడానికి ఏ శక్తులు ఢిల్లీలో పని చేశాయో పరిశోధిస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు 'చిదంబర' రహస్యం బయటికొచ్చిందట. కిరణ్‌కుమార్ తండ్రి నల్లారి అమరనాథ్‌రెడ్డి, 'తమిళతంబి' మాంచి ఫ్రెండ్స్. తమిళనాడుకు అతి సమీపంలో నల్లారి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉంది. అమరనాథ్‌రెడ్డికి చిదంబరానికి దగ్గరి సాన్నిహిత్యం ఉండేదట. చిదంబరం కొన్నాళ్లపాటు కాంగ్రెస్‌ను వీడి మొపనార్ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ నల్లారి వారి కుటుంబానికి, ఆయనకు సంబంధాలు కొనసాగాయట. కేంద్రంలో కాంగ్రేసేతర ప్రభుత్వంలో పని చేసినప్పుడు కూడా చిదంబరానికీ, నల్లారి ఫ్యామిలీకి సాన్నిహిత్యం కొనసాగిందట.
Saturday, November 27, 2010
గ్రీటింగ్×పరామర్శ
గ్రీటింగ్, పరామర్శ ఈ రెంటిలో ఏది ముందు? రాష్ట్ర కాంగ్రెస్ నేతల ముందున్న పజిల్ ఇది. గ్రూపు తగాదాల్లో తలమునకలైన కాంగ్రెస్ వారికి హఠాత్తుగా ఈ ధర్మసందేహం ఎందుకొచ్చిందంటారా? మొన్న కొన్ని గంటలపాటు నూతన ముఖ్యమంత్రి ఎవరవుతారోనని బీపీలు పెంచుకున్న పార్టీ నేతలకు ఆ కాస్తా తెలిశాక మంత్రి పదవులపై తెగ ఆందోళన పడుతున్నారు. నూట పాతికేళ్ల కాంగ్రెస్‌లో ఎలాగూ ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువ కనుక మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల పైరవీలు, లాబీయింగ్ సరేసరి. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజున అధికారులతో కిరణ్‌కుమార్‌రెడ్డి లాబీయింగ్ కాదు సమర్ధతే గీటురాయి అని చెప్పుకొచ్చారు. ఆ సమావేశానికి హాజరైన అధికారులు వాళ్లలో వారు ఢిల్లీలో లాబీయింగ్ చేయడంవల్లనే ఈయనగారు సిఎం అయ్యారట కదా అని గుసగుసలాడుకున్నారట. కుర్చీ ఎక్కిన తర్వాత ముచ్చటగా మూడో రోజున కిరణ్ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నట్లు? అని గొణుకున్నారు.
Thursday, November 25, 2010
కిరణ్ మిలీనియం జోక్
మూడు కుంభకోణాలు, ఆరు అక్రమాలతో వర్ధిల్లుతున్న యుపిఎ ప్రభుత్వం 2జి స్పెక్ట్రం స్కాంతో ఎటూ పాల్పోక ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. '2జి'పై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి) విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ ఉత్పాతం నుండి ఎలా బయటపడాలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను మరింత కుంగదీశాయి. బీహార్‌లో సోనియా,రాహుల్ ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్‌కు ఐదారు సీట్లే వచ్చాయి. సోనియా, రాహుల్ లోక్‌సభ స్థానాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రం. రోజురోజుకూ కాంగ్రెస్ అడుగు జారుతుండగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలకు 41 గెలుచుకుంటామంటున్నారు కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఎందుకనో ఒక్క సీటు వదిలిపెట్టారు. అంతేకాదు 41 ఎంపీలను గెలిపించి రాహుల్‌ను ప్రధానిని చేస్తారట. ఈ కోరిక తనది కాదట. వైఎస్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు 41 లోక్‌సభ సీట్లు సాధించి రాహుల్‌ను ప్రధానిని చేస్తామన్నారట. వైఎస్ ఆఖరి ఆశను కిరణ్‌కుమార్ నెరవేరుస్తారట.
తెర వెనుక కథేంటి?
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణాలో ఆందోళనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎలా సిఎంను చేస్తారన్న వాదనలన్నీ పటాపంచలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం సిఎం పదవికి ఎంపిక చేసింది. గురువారం ఆయన రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేస్తారు. కిరణ్‌కుమార్ గతంలో వైఎస్‌కు సన్నిహితంగా మెలిగినప్పటికీ, చీఫ్‌విప్‌గా, స్పీకర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ వైఎస్ చనిపోయాక జగన్‌కు వ్యతిరేకంగా మారినట్లు చెబుతున్నారు. జగన్‌కు చెక్ పెట్టడానికి రాయలసీమకు చెందిన కిరణ్‌కుమార్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించినట్లుంది.
Tuesday, November 23, 2010
గొంగట్లో అన్నం తింటూ...?!
మొక్కప్పుడు తుంచేయకపోతే మాను అవుతుందన్న సామెత ఇప్పటి మీడియా పోకడకు సరిగ్గా అతుకుతుంది. మనం చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పు అంటోంది ఇప్పటి మీడియా. మీడియా అంటే కేవలం టీవి చానెల్స్ మాత్రమే కాదు. ప్రధాన పత్రికలకూ ఈ విమర్శ వర్తిస్తుంది. పక్కనున్న తమిళనాడులో మీడియా, రాజకీయ పార్టీలకు మధ్య సరళరేఖ చెరిగి పోయిందని అనుకున్నాం. అక్కడ పార్టీలే పత్రికలు, మీడియాను నడుపుతున్నాయని వింత ప్రదర్శించాం.
Monday, November 22, 2010
మైక్రోల కోసమే ఆ బిల్లు?
Subscribe to:
Posts (Atom)





