Saturday, January 15, 2011
Friday, January 14, 2011
Wednesday, January 12, 2011
ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా కిరణ్ సర్కార్ పడిపోదా?
తాను తలుచుకుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కూలుతుందంటున్నారు వైఎస్ జగన్. తమ సర్కార్‌కు జగన్ వల్ల ముప్పు ఉండబోదంటున్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ. జగన్ దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం నడవట్లేదని, దమ్ముంటే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసురుతున్నారు మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావు, తులసిరెడ్డి తదితరులు. జగన్ కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఎవరు ఏం చెప్పినా సామాన్యులకు మాత్రం ప్రభుత్వ మనుగడపై అంతుబట్టకుండా ఉంది. కిరణ్‌కుమార్ సర్కార్ ఉంటుందా ఊడుతుందా అని లెక్కలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మీడియాలోనైతే నైతికంగా సర్కార్ మైనార్టీలో పడ్డట్లేనంటూ వార్తలొస్తున్నాయి.
Monday, January 10, 2011
మీడియా అన్నింటికీ అతీతమా?
మీడియా అన్నింటికీ అతీతమా? ఎటువంటి చట్టాలూ దానికి అమలు కాకూడదా? స్వతంత్రంగా వదిలేయాలా? ఎప్పటి నుండో మీడియా పాత్రపై విస్తృతంగా ఈ చర్చ జరుగుతోంది. ముంబయిపై ఉగ్రవాది దాడి తర్వాత మీడియా పాత్ర వివాదాస్పదమైంది. స్వీయ నియంత్రణను నొక్కి చెబుతున్నప్పటికీ దాని అమలు ఎప్పటికప్పుడు ప్రశ్నార్ధకమవుతోంది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఆందోళనల కవరేజిపై, చానళ్ల ప్రసారాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటున్నారు తెలంగాణాలోని కొన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, ఓయు విద్యార్థులు. ఎమర్జెన్సీని తలపిస్తోందని మండి పడుతున్నారు. మీడియాపై ఆక్షలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టంటున్నాయి చాలా చానళ్లు. ఆంక్షలు తొలగించాలని నేతలు, చానళ్ల సిఇఓలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసులు మాత్రం మీడియాపై ఆంక్షల్లేవంటున్నారు. టీవీ ప్రసారాలపై నేషనల్ బ్రాడ్‌కాస్టర్లు (ఎన్‌బిసి) రూపొందించుకున్న మార్గదర్శకాలను అమలు చేయాలంటున్నామని డిజిపి అరవిందరావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఎకె ఖాన్ చెబుతున్నారు. హౌం మంత్రి సబితారెడ్డి సైతం ఆంక్షల్లేవన్నారు.
Sunday, January 9, 2011
శ్రీకృష్ణా..ఆచరణ సాధ్యం కాని సిఫారసులెందుకు?
శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమీబాలాంటిదంటున్నారు పలువురు రాజకీయ నేతలు. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అయితే ఎవరికిష్టమొచ్చినట్లు వారు నివేదికను అన్వయించుకోవచ్చన్నారు. శ్రీకృష్ణ నివేదికలో కొత్తదనం ఏమీ ఉండదని ఈ నెల 6న ఢిల్లీలో చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కెసిఆర్ హాజరు కాలేదు. కాని శ్రీకృష్ణ నివేదిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదని భాష్యం చెప్పారు. కెసిఆర్ అంతటి వారే నివేదికను తనకు అనుకూలంగా అన్వయించుకున్నారంటే సామాన్యులు ఆ పని చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు.
Sunday, January 2, 2011
బ్రిజేష్ తీర్పుతోనైనా పార్టీల కళ్లు తెరుచుకుంటాయా?
కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ వెలువరించిన తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన రాజకీయ పార్టీలు కళ్లు తెరవాల్సిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్ నిట్టనిలువునా చీలి ప్రాంతాలవారీగా కుమ్ములాడుకుంటుంటే ఎగువ రాష్ట్రాలు రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలను తన్నుకు పోతున్నాయి. రాష్ట్రం ఎడారయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఎగువ రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలు వారి వారి రాష్ట్ర ప్రయోజనాలకోసం కలిసి పని చేస్తుంటే మన దౌర్భాగ్యం కొద్ది మన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సొంత ప్రయోజనాలు, ఓట్ల కోసం, అధికారం కోసం తాపత్రయ పడుతున్నాయి. అంతర్గత గొడవల్లో కొన్ని పార్టీలు, ఎదుటి పార్టీలపై పైచేయి సాధించాలని కొన్ని పార్టీలు, రాజకీయాధికారం కోసం కొన్ని పార్టీలు కీచులాడుకుంటున్నాయి.
Saturday, January 1, 2011
Subscribe to:
Posts (Atom)






